BigTV English

Hyundai Exter Hy CNG Duo: హ్యుందాయ్ నుంచి CNG.. 27 కిమీ మైలేజ్.. ప్రైస్ ఎంతంటే?

Hyundai Exter Hy CNG Duo: హ్యుందాయ్ నుంచి CNG.. 27 కిమీ మైలేజ్.. ప్రైస్ ఎంతంటే?

Hyundai Exter Hy CNG: దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు అధిక మైలేజ్ అందించే టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే హ్యుందాయ్ మోటర్స్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. కంపెనీకి చెందిన ఫేమస్ కార్ ఎక్సెటర్ ఇప్పుడు సీఎన్‌జీ గ్యాస్‌తో రోడ్లపై పరుగులు పెడుతుంది. హ్యుందాయ్ ఎక్సెటర్ సీఎన్‌జీ వెర్షన్ ‘ఎక్సెటర్ హెచ్‌వై సీఎన్‌జీ డ్యూయో’ పేరుతో లాంచ్ చేసింది. ఈ కారు ఇప్పుడు S, SX, SX నైట్ అనే మూడు వేరియంట్లలో రానుంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.8.50 లక్షలు. అంతేకాకుండా కారు ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని డీలర్షిప్‌‌లలో అందుబాటులో ఉంది.


హ్యుందాయ్ ఎక్సెటర్ ఈ CNG వెర్షన్‌లో రెండు చిన్న CNG సిలిండర్‌లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. ఇది కారుకు ఎక్కువ బూట్ స్పేస్‌ను అందిస్తుంది. కానీ దీని కారణంగా కారులో స్పేర్ వీల్ అందించడం లేదు. దీనికి బదులుగా మీరు పంక్చర్ రిపేర్ కిట్ పొందుతారు. హ్యుందాయ్ ఎక్సెటర్ CNG వెర్షన్ కూడా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. అయితే ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఈ CNG మోడల్‌లో ఇది ఒక కిలో గ్యాస్‌లో సుమారు 27.1 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తోంది.

Also Read: Nissan Magnite Facelift: వామ్మో.. ఇదేం ఎస్‌యూవీ భయ్యా.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది!


హ్యుందాయ్ ఎక్సెటర్ ప్రారంభ ధర రూ. 6.13 లక్షలు, టాప్ మోడల్ ధర రూ. 10.43 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎక్సెటర్ MIDతో 4.2-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్ పాన్ సన్‌రూఫ్, డ్యుయల్ కెమెరాతో డాష్ క్యామ్ వంటి ఫీచర్ల ఉన్నాయి.

భద్రతా ఫీచర్ల గురించి చెప్పాలంటే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), హిల్ హోల్డ్ అసిస్ట్, ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు వంటి ఫీచర్లు అందించబడ్డాయి. పెట్రోల్ ఇంజన్ పవర్‌ట్రెయిన్ హ్యుందాయ్ ఎక్సెటర్ 5 సీట్ల కారు. దీనిలో ఐదుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. ఇంజన్, ట్రాన్స్‌మిషన్ గురించి మాట్లాడితే ఈ హ్యుందాయ్ కారులో 1.2-లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (83PS/114NM) ఉంది.

Also Read:Mahindra Upcoming SUVs: మహీంద్రా నుంచి మూడు ఎస్‌యూవీలు.. ఇక రోడ్లపై సమరమే.. లాంచ్ ఎప్పుడంటే!

దీనితో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఎక్సెటర్ SUV 1.2-లీటర్ పెట్రోల్-CNG ఆప్సన్ (69PS/95NM), 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. మీరు  అధిక మైలేజీని ఇచ్చే కారు కోసం చూస్తున్నట్లయితే హ్యుందాయ్ ఎక్సెటర్  CNG వెర్షన్ మీకు మంచి ఆప్షన్‌గా ఉంటుంది.

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×