Assembly sessions: కాళేశ్వరం కమిషన్ రిపోర్టు రావడంతో వేగంగా అడుగులు వేయాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. వచ్చేవారం నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మొదలుపెట్టాలని భావిస్తోంది. కమిషన్ రిపోర్టుపై చర్చించనుంది. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అసెంబ్లీ వేదికగా దర్యాప్తు సంస్థ గురించి ప్రకటన చేయాలని భావిస్తోంది.
దాదాపు ఏడాది తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ తన రిపోర్టు ప్రభుత్వానికి అందజేసింది. నివేదికపై సోమవారం కేబినెట్ భేటీలో ప్రభుత్వం చర్చించనుంది. కమిషన్ నివేదికపై చర్చించిన తర్వాత మంత్రుల సలహాలతో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది.
కమిషన్ నివేదిక ఇప్పటికే ఆలస్యమైందని వివిధ పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో వీలైతే వచ్చేవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోందట ప్రభుత్వం. కేబినెట్ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
నివేదికపై రెండు లేదా మూడు రోజులపాటు చర్చించనున్నారట. సభ్యులందరికీ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. ప్రాజెక్టు వెనుక అసలు ఏం జరిగింది? ప్రజలకు తెలిసేలా సమగ్ర చర్చకు ప్లాన్ చేస్తోందట కాంగ్రెస్ ప్రభుత్వం. చివరకు అన్నిపార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకున్నా తర్వాత వాళ్ల నిర్ణయం మేరకు సిట్ వేస్తుందా? లేక సీబీఐ విచారణకు ఇస్తుందా? అనేది తేలనుంది.
ALSO READ: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, ఎందుకో తెలుసా?
కాళేశ్వరం కమిషన్ రిపోర్టు తర్వాత జరుగుతున్న పరిణామాలను విపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆసక్తిగా గమనిస్తోంది. ప్రత్యేక సమావేశాలకు హాజరుకావాలా? వద్దా? అనేదానిపై అధినేత కేసీఆర్‌తో చర్చించనున్నా రు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. హాజరుకాకుంటే తప్పు చేసినవాళ్లం అవుతామని, హాజరై పార్టీ తరపున తమ వాదన వినిపించాలని మరికొందరు నేతలు అంటున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బీఆర్ఎస్ పార్టీలో మరొక చర్చ జరుగుతోంది. సిట్ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం వేస్తోందని, దానికంటే సీబీఐ విచారణకు ఇస్తే బాగుంటుందని ఇంకొందరి నేతలు ఆఫ్ ద రికార్డులో చర్చించు కుంటున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏదిఏమైనా కాళేశ్వరం రిపోర్టు తర్వాత ఆ పార్టీ నేతలు తమ ఫ్యూచర్ ఏంటన్నది ఆలోచనలో పడ్డారు. ఈ గండం నుంచి బీఆర్ఎస్ ఏ విధంగా గట్టెక్కుతుందో చూడాలి.
ఈనెల 10 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం?
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై సభలో ప్రత్యేక చర్చ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం pic.twitter.com/TLZo7vIU1y
— BIG TV Breaking News (@bigtvtelugu) August 4, 2025