Assembly Special Session: రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణనను అనుకూలంగా మలచుకునేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయా? రాజకీయంగా మలచుకునేందుకు సిద్ధమవుతున్నాయా? అసలు నివేదికపై చర్చ జరగకుండా బురద జల్లే ప్రయత్నం చేస్తోందా? ఈ విషయంలో బీఆర్ఎస్ కంటే బీజేపీ ముందుందా? అవుననే అంటున్నారు కొందరు రాజకీయ నేతలు.
రేవంత్ సర్కార్ చేపట్టిన సమగ్ర కుల గణన నివేదికపై మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం కానుంది. కులగణన, ఎస్సీ వర్గకరణపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి, మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనిపై ప్రకటన చేయనున్నారు.
అంతకుముందు మంగళవారం ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ హాలులో కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చించనున్నారు. కులగణన రిపోర్టు, ఎస్సీవర్గకరణ రికమండేషన్స్ రిపోర్టుపై చర్చించి ఆమోదం తెలపనుంది. ఉభయసభల్లో దీనిపై సభ్యులంతా చర్చించనున్నారు. దీంతో కులగణనపై తొలి అంకం పూర్తి కానుంది.
అసెంబ్లీ తీర్మానం చేసిన ఆ కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది రేవంత్ ప్రభుత్వం. ఈ ప్రాసెస్ తర్వాత అసెంబ్లీ రిలీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అన్ని వివరాలను బీసీ డెడికేటెడ్ కమిషన్ తీసుకోంది. ఇప్పటికే వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంతోపాటు కులగణన వివరాలను తీసుకుని ఫైనల్‌గా సిఫార్సులు చేసే ఛాన్స్ ఉంది.
ALSO READ: కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం మల్లగుల్లాలు.. వన్ షార్ట్ టూ బర్డ్స్ ఫార్ములా
ఈ వ్యవహారం జరిగేందుకు దాదాపు వారం పట్టవచ్చన్నది ప్రభుత్వం వర్గాల మాట. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా కొత్త రిజర్వేషన్లు రికమెండేషన్ చేయనుంది. దాని ప్రకారం ప్రభుత్వం అడుగులు వేయనుంది. ఆపై స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానుంది.
బీసీ కులగణను మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రానికి తీర్మానం పంపాయి. అవన్నీ పక్కన పెట్టేసింది. బీసీ మంత్రం ఎత్తుకుంటే, టాప్ కమ్యూనిటీలు దూరమయ్యే ప్రమాద ముందన్నది కమలనాధుల ఆలోచన. అందుకే రేవంత్‌రెడ్డి సర్కార్ చేపట్టిన కులగణనపై విమర్శలు కంటిన్యూ చేస్తోంది.