Best Fantasy Movies on OTT: హాలీవుడ్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమాలు, మూవీ లవర్స్ ని పిచ్చెక్కిస్తూ ఉంటాయి. ఒకసారి చూసినవాళ్లు, ఈ సినిమాలను మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారు. అంతలా ఈ సినిమాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలు తెలుగులో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ప్రేక్షకులు మిస్ కాకుండా చూడాల్సిన బెస్ట్ ఫాంటసీ మూవీలు ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
ది సోర్సెరర్స్ అప్రెంటిస్ (The Sorcerer’s Apprentice)
2010 లో రిలీజ్ అయిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి జాన్ టర్టెల్‌టాబ్ దర్శకత్వం వహించగా, జెర్రీ బ్రూక్‌హైమర్ నిర్మించారు. ఈ మూవీలో నికోలస్ కేజ్, జే బరుచెల్‌లు ఆల్‌ఫ్రెడ్ మోలినా, తెరెసా పాల్మెర్, మోనికా బెల్లూచి నటించారు. ‘ది సోర్సెరర్స్ అప్రెంటీస్’ జూలై 8, 2010న ఫాంటాసియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. జూలై 14న యునైటెడ్ స్టేట్స్‌లో డిస్నీచే థియేట్రికల్‌గా విడుదలైంది. ఈ మూవీ $215 మిలియన్లు వసూలు చేసింది. ఈ అడ్వెంచర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది.
జర్నీ 2: ది మిస్టీరియస్ ఐలాండ్ (Journey 2 : The mysterious Island)
2012 లో వచ్చిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి బ్రాడ్ పేటన్ దర్శకత్వం వహించారు. జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్‌కు సీక్వెల్గా ది మిస్టీరియస్ ఐలాండ్ ను తెరకెక్కించారు. ఇందులో డ్వేన్ జాన్సన్, మైఖేల్ కెయిన్, జోష్ హచర్సన్, వెనెస్సా హడ్జెన్స్, లూయిస్ గుజ్మాన్, క్రిస్టిన్ డేవిస్ నటించారు. ఇది ఒక అగ్నిపర్వత శాస్త్రవేత్త కథ చుట్టూ తిరుగుతుంది. చాలా కాలం తర్వాత తన తాత నుండి వచ్చిన కాల్‌కు సమాధానం ఇస్తాడు హీరో. అతని మిలిటరిస్టిక్ సవతి తండ్రి, హెలికాప్టర్ టూర్ సిబ్బంది సహాయంతో, ఒక రహస్యమైన ద్వీపానికి రెస్క్యూను మౌంట్ చేస్తాడు. జర్నీ 2: ది మిస్టీరియస్ ఐలాండ్ ఫిబ్రవరి 10, 2012న వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, న్యూ లైన్ సినిమా, వాల్డెన్ మీడియా ద్వారా సినిమా థియేటర్లలో విడుదలైంది, అయితే ప్రపంచవ్యాప్తంగా $335 మిలియన్ల వసూళ్లు సాధించి, దాని ముందున్న మొదటి పార్ట్ ను అధిగమించి బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
డోలిటిల్ (Dolittle)
2020 వచ్చిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీకి స్టీఫెన్ గఘన్ దర్శకత్వం వాహంచారు. రాబర్ట్ డౌనీ జూనియర్ టైటిల్ క్యారెక్టర్‌గా నటించగా, ఆంటోనియో బాండెరాస్, మైఖేల్ షీన్, జిమ్ బ్రాడ్‌బెంట్, జెస్సీ బక్లీ, హ్యారీ కొలెట్, కాసియా స్ముత్నియాక్ యాక్షన్ పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో సినిమా (jio Cinema) లో స్ట్రీమింగ్ అవుతుంది. చిన్నపిల్లలతో కలసి ఈ ఫాంటసీ అడ్వెంచర్ సినిమాలను చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.