Jani Master : టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు ఇటీవల వార్తల్లో హైలెట్ గా నిలుస్తూ వచ్చింది. లైంగిక వేధింపుల కేసులో ఆయన అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే జానీ తిరిగి వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇంటికే పరిమితమయ్యాడు.. ఆ కేసు వల్ల పుష్ప2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి అయినా దూరమయ్యారు. అంతేకాదు జాతీయ అవార్డు కూడా మాస్టర్ కు దూరమైంది.. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాస్టర్ ఆయన భార్య వాళ్ళు చానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నారు.. తన తప్పేమీ లేదని నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని అంటున్నారు. తనని తాను ప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జానీ మాస్టర్. ఇటీవల ఓ సినిమాకు సాంగ్ ని కంపోస్ట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ ఎమోషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజాగా అతనికి మరో అవకాశం వచ్చింది. కన్నడలో తెరకెక్కుతోన్న ఓ మూవీకు జానీ పని చేయనున్నాడు. తాజాగా తన కొత్త సెట్ కు జానీమాస్టర్ వెళ్ళాడు. అక్కడ అతనికి ఊహించని స్వాగతం లభించింది. జానీ మాస్టర్‌కి గుమ్మడి కాయతో దిష్టి తీసి హారతిచ్చి సెట్స్‌లోకి ఆహ్వనించారు.. ఆ తర్వాత ఆయన చేత వెల్కమ్ బ్యాక్ అని కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు. తనకు ఇంత గ్రాండ్ వెల్కమ్ లభించినందుకు జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియోని నెట్టింటవైరల్ గా మారింది.. అందరికీ థ్యాంక్స్ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు మాస్టర్..
ఆ పోస్ట్ లో చాలా రోజుల తర్వాత బెంగళూరులో అడుగుపెట్టాను. యూవర్స్ సిన్సియర్లీ రామ్ సెట్స్లో అడుగుపెట్టిన నాకు సంతోషంగా ఉంది. ఇంతటి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన ఈ మూవీ టీమ్ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. అంటూ జానీ మాస్టర్ పోస్ట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఆల్ ది బెస్ట్ జానీ మాస్టర్ సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుంటున్నాము అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడ్డాక ఆయనకు సినిమా అవకాశాలు వస్తాయో రావో అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ఇప్పుడు ఓ మూవీలో ఆఫర్ రావడంతో జానీ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇక తనపై నమోదైన కేసుపై జానీ మాస్టర్ ఇప్పటికే స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని.. విచారణ పూర్తయిన తర్వాత అన్ని నిజాలు బయటికొస్తాయని జానీ చెబుతున్నారు.. ఇక తెలుగులో ఏ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేస్తారు చూడాలి.. ఏది ఏమైనా జానీ మాస్టర్ ఇలా సినిమాలతో బిజీ అవడం చూసి చాలా కాలం అయింది..
కన్నీరు పెట్టిన జానీ మాస్టర్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చాలాకాలం తర్వాత ఓ మూవీ సెట్లోకి అడుగుపెట్టారు. బెంగళూరులో జరుగుతున్న ఓ మూవీ షూటింగ్ స్పాట్ వద్దకు వెళ్లిన ఆయనకు చిత్రబృందం తొలుత గుమ్మడి కాయతో దిష్టి తీయించింది. అనంతరం కేక్ కట్ చేయించి వెల్కమ్ చెప్పింది. వారు చూపిన… pic.twitter.com/SZXPaoG6PT
— ChotaNews App (@ChotaNewsApp) February 3, 2025