Weather News: మొంథా తుపాను ప్రభావంలో తెలంగాణపై పడింది. గత మూడు, నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ లో అర్థరాత్రి నుంచే పలు చోట్ల వర్షం పడుతోంది. రోడ్లపై ఎక్కడ చూసినా నీరు కనిపిస్తోంది. రాబోయే రెండు లేదా మూడు గంటలు పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఉదయం, మధ్యాహ్నం వేళ ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం కాగానే వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యం వరి పంట చేతికి వచ్చే సమయానికే వర్షాలు పడుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు.
కాసేపట్లో జిల్లాల్లో భారీ వర్షం..
మరి కాసేపట్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిద్దిపేట, జనగామ, యాదాద్రి – భువనగిరి, మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, ఖమ్మం జిల్లాల్లో మరి కాసేపట్లో భారీ వర్షం పడనుందని పేర్కొన్నారు. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వివరించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, గాజుల రామారం, మల్కాజిగిరి, అల్వాల్, కాప్రా, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం పడుతోంది. భారీ వర్షాల పట్ల భాగ్యనగర వాసులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు భాగ్యనగరంలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించారు.
ALSO READ: Maoist Party: మావోయిస్ట్ పార్టీకి మరోసారి భారీ షాక్.. డీజీపీ ముందు కీలక నేత బండి ప్రకాష్ సరెండర్
చెట్ల కింద ఉండొద్దు.. అధికారులు కీలక సూచన
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు బయటకు రావొద్దని చెబుతున్నారు. వర్షాల పడే సమయంలో చెట్ట కింద నిలబడొద్దని సూచించారు. చెట్లపైనే ఎక్కువగా పిడుగులు పడే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం వేళ రైతులు పొలాల వద్దకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Air India Bus Fire: ఢిల్లీ విమానాశ్రయంలో మంటలు, కాలి బూడిదైన ఎయిర్ ఇండియా బస్సు!