Telangana Bjp: తెలంగాణలో రాజకీయాలు బీసీల చుట్టూనే తిరుగుతోందా? ఎందుకు బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎంపిక వాయిదా వేస్తోంది? ఇప్పటివరకు ముగ్గురు రేసులో ఉండగా, ఆ సంఖ్య ఐదుగురికి పెరిగిందా? సీఎం రేవంత్ రాజకీయాలను బీజేపీ పెద్దలు ఆసక్తిగా గమనిస్తున్నారా? మరో రెండు వారాల్లో కొత్త దళపతి ఎవరన్నది తేలిపోతునుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎవరనేది ఇప్పుడు ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో చర్చ మొదలైపోయింది. జనవరి సెకండ్ వీక్‌లో ప్రకటన వస్తుందని భావించారు. కానీ డిలే అవుతూ వస్తోంది. ఇప్పుడు మరో రెండువారాలు ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు ఢిల్లీ సమాచారం. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటన చేయాలని ఆలోచన చేస్తోంది బీజేపీ హైకమాండ్.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఉన్నారు. తాజాగా మరో ఇద్దరు పేర్లు బయటకు వచ్చాయి. వారిలో ఒకరు ఒకరు బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు, మరొకరు డీకే అరుణ. వీరంతా ఎవరికి వారే ఆశలు పెట్టుకున్నారు. పైగా ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కూడా మొదలుపెట్టేశారు.
మరో వార్త ఏంటంటే.. కొత్త అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియను పార్టీ హైకమాండ్ షురూ చేసింది. ఇందులోభాగంగా పార్టీ కీలక నేతలు సునీల్ బన్సల్, శివప్రకాశ్, అర్వింద్ మీనన్‌తోపాటు కేంద్రమంత్రి శోభ ఈనెల 9 లేదా 10న రావచ్చని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. తొలుత వీరంతా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో ప్రత్యేకంగా భేటీ అవుతారు.
ALSO READ: బీఆర్ఎస్ నేతలారా.. అవి మరచిపోవద్దు.. జగ్గారెడ్డి కామెంట్స్
ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. జిల్లాల్లో కొత్తగా నియమితులైన అధ్యక్షుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు ఢిల్లీ పరిశీలకులు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ప్రకటన రావచ్చని అంటున్నారు. ఈ తతంగం పూర్తి అయ్యేసరికి మరో రెండు వారాలు పట్టే ఛాన్స్ ఉంది.
ఇదిలావుండగా తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకోవడంతో అదే పల్లవిని అధ్యక్షుడి ఎంపికలో పాటించాలని ఆలోచన చేస్తోంది బీజేపీ. ఒకవేళ అధ్యక్ష పదవి రెడ్డి, వెలమ కమ్యూనిటీకి ఇస్తే.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి క్రియేట్ చేయాలని ఆలోచన చేస్తోంది. ఆ పదవిని బీసీ వ్యక్తిని ఇవ్వాలన్నది కమలనాథుల ఆలోచన. అధ్యక్షుడు బీసీ అయితే, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లేనట్టేనని పార్టీ వర్గాల మాట.