E-Paper
Advertisement

ఆటో సంఘాలతో చర్చలు సఫలం.. కార్మిక సంఘాలకు మంత్రి పొన్నం ధన్యవాదాలు

ఆటో సంఘాలతో చర్చలు సఫలం.. కార్మిక సంఘాలకు మంత్రి పొన్నం ధన్యవాదాలు
Advertisement

Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమైన ఆటో కార్మిక సంఘాలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. ప్రభుత్వంతో సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో వెనక్కి తగ్గాయి. దీంతో యథావిధిగా ఆటోలు తిరగనున్నాయి. బంద్ రద్దు కావడంతో సామాన్యులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఆటో కార్మిక సంఘాల డిమాండ్లు ఏంటి?

 

ఆటో సంఘాలతో చర్చలు సఫలం

Advertisement

తెలంగాణ వ్యాప్తంగా ఆటో జేఏసీ నేతలతో తెలంగాణ ప్రభుత్వ చర్చలు సఫలం అయ్యాయి. ఆటో-క్యాబ్ డ్రైవర్ల డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది రవాణా శాఖ. ఆయా సంఘాలు 14 డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను కార్మిక సంఘాల నేతలు విరమించారు. దీంతో ఆటోలు, ఓలా, ఉబెర్, ఇతర క్యాబ్ సేవలు కొనసాగనున్నాయి.

ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించిన సంఘాల నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అనేక ప్రధాన డిమాండ్లను అంగీకరించడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం, ఆటో సంఘాల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.

Advertisement

 

సమ్మె విరమణ.. కార్మిక సంఘాలకు మంత్రి ధన్యవాదాలు

వచ్చే నెల ఒకటిన రవాణా-ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి. ఆటో ఛార్జీలు పెంచేందుకు, క్యాబ్‌లకు ప్రభుత్వం తరఫున యాప్‌ రూపొందిస్తామని హామీ ఇచ్చారు.  2012 తర్వాత ఆటో చార్జీలు పెంచలేదని చార్జీలు పెంచడానికి అంగీకరిస్తూ సంబంధిత జీవో విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది.

ఓలా, ఉబెర్, ర్యాపిడో మాదిరిగా ప్రభుత్వం తరపున యాప్ తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. టూ వీలర్స్ ర్యాపిడో, ఓలా, ఉబెర్ నడిపే వాటికి ఎల్లో ప్లేట్ ఉన్న వాహనాల్లో ప్రయాణికులను తరలింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఆటో కార్మికులకు 12 వేల రూపాయల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్.

ALSO READ: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణలకు భారీ వర్ష సూచన

ఆటో- ప్రైవేట్‌ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిగ్‌ వర్కర్స్‌ అగ్రిగేటర్‌ పాలసీని అమలు, ట్రాఫిక్‌ చలాన్లపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలన్నది మరొక కోరిక. హైదరాబాద్ క్యూర్ ఏరియా పరిధిలో పాత డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చడానికి రూ. 1.50 లక్షలు ప్రభుత్వం సహాయం అందిస్తుందని మంత్రి తెలిపారు.

కొత్త ఆటోలు కొనుగోలు చేయడానికి సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు పొన్నం. ఆర్టీసీ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసి నడుపుతారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అవన్నీ నిరాధారమైన తప్పుడు ప్రచారం అని రవాణా శాఖ మంత్రి పొన్నం స్పష్టం చేశారు.

 

 

Related News

తెలంగాణలో వ్యూహం మార్చిన జనసేన.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. అభ్యర్థిగా శ్రీనివాస్ పేరు ఖరారు

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణలకు భారీ వర్ష సూచన

మల్లారెడ్డి యూనివర్సిటీలో అపశ్రుతి.. స్పీకర్లు పడి విద్యార్థులకు గాయాలు!

తెలంగాణ రైజింగ్ కు గ్లోబల్ అంబాసిడర్లుగా మారండి ఎన్ఆర్ఐలకు సీఎం రేవంత్ పిలుపు!

మంత్రి ఉత్తమ్ సాగర్‌లో దూకండి నీళ్లున్నాయో లేదో తెలుస్తుంది: జగదీష్ రెడ్డి!

చెత్త కుప్పల నుంచి పచ్చని పార్కుగా.. భద్రాచలం గోదావరి కరకట్ట సుందరీకరణ!

విద్యార్థుల సమస్యలపై బీజేపీ సమరశంఖం.. 2 రోజులపాటు నిరాహార దీక్ష!

Big Stories

Advertisement
×