E-Paper
Advertisement

మల్లారెడ్డి యూనివర్సిటీలో అపశ్రుతి.. స్పీకర్లు పడి విద్యార్థులకు గాయాలు!

మల్లారెడ్డి యూనివర్సిటీలో అపశ్రుతి.. స్పీకర్లు పడి విద్యార్థులకు గాయాలు!
Advertisement

Toxic Event: స్వేచ్ఛ బ్యూరో: మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి నిర్వహించిన ‘టాక్సిక్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో విద్యార్థులు, అభిమానులు తరలివచ్చిన సమయంలో సౌండ్‌ స్పీకర్లు విద్యార్థులపై పడటంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్సుల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. రాజ్‌కుమార్‌ (20)కు చేయి, కాలికి ఫ్రాక్చర్‌ అయినట్లు సమాచారం. మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి.

అధిక జనసందోహంతో గందరగోళం

ఈవెంట్‌కు అనుమతించిన పరిమితికి మించి ప్రేక్షకులను ప్రాంగణంలోకి అనుమతించడంతో అధిక జనసందోహం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. సౌండ్‌ స్పీకర్లు ఏర్పాటు చేసిన స్టాండ్లపై విద్యార్థులు ఎక్కడంతో అవి అదుపుతప్పి కిందపడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో కొద్దిసేపు ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

Advertisement

Also read: బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ వాచ్ కావాలా? అయితే..ఈ మోడల్ మీ కోసమే!

నిర్వాహకులపై కేసు

కార్యక్రమంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలపై పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్‌ఆర్‌ఓ విధుల్లో ఉన్న అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అనుమతించిన పరిమితికి మించి ప్రేక్షకులను అనుమతించడంతో తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉన్నప్పటికీ నిర్వాహకులు అదనపు జనాన్ని అనుమతించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే అధికారుల అనుమతించిన సమయ పరిమితిని మించి కార్యక్రమాన్ని కొనసాగించినట్లు ఆరోపించారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకులైన శ్రేయాస్‌ మీడియా, మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also read: అంజయ్య నగర్ ప్రమాదంలో బయటపడ్డ సంచలనాలు.. బిల్డర్ సాజిద్ అక్రమాల చిట్టా రట్టు!

Tags

Related News

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

హైదరాబాద్‌వాసులపై అధికారులు నిఘా.. ఓ వ్యక్తికి రూ.20 వేల జరిమానా, నీటిని వృథా చేసినందుకు

గ్లోబల్ సంస్థలకు తెలంగాణలో తిరుగులేని ఆఫర్లు.. ఐటీ శాఖ రోడ్‌మ్యాప్ ఇదే?

తెలంగాణలో కాంగ్రెస్ భారీ ఆందోళనకు పిలుపు.. ‘చలో రాజ్‌భవన్’ ఎప్పుడంటే?

తెలంగాణలో రోడ్డు ప్రమాదాల కట్టడికి జీఓ.. డీజీపీ ఆనంద్ బిగ్ ప్లాన్!

పీఎం శ్రీ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

దుర్గామాత మండపాల నిర్వాహకులు షాకింగ్ న్యూస్.. రూల్స్ పాటించాల్సిందే?

దసరాకు ఊరెళ్లేవారికి తీపి కబురు.. 7 వేల ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఉచితం యథాతథం!

Big Stories

Advertisement
×