E-Paper
Advertisement

తెలంగాణలో వ్యూహం మార్చిన జనసేన.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. అభ్యర్థిగా శ్రీనివాస్ పేరు ఖరారు

తెలంగాణలో వ్యూహం మార్చిన జనసేన.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. అభ్యర్థిగా శ్రీనివాస్ పేరు ఖరారు
Advertisement

TG Graduates Mlc Elections: తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ దూకుడు పెంచింది. కేడర్-నేతలను నిరుత్సాహపరచకుండా ఉండేందుకు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బరిలోకి దిగనుంది. ఆ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరు ఖరారు చేసింది. ఎందుకంటే.. ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తికావడంతో కలిసి వస్తుంది అంచనా వేసింది.

 

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. మిగతా పార్టీల ఊహలకు అందని విధంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఆ సీటుకు అభ్యర్థిని ప్రకటించింది జనసేన పార్టీ. డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరును అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ వెల్లడించారు.

ప్రస్తుతం జనసేన తెలంగాణ అధికార ప్రతినిధిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా సమన్వయకర్తగా గడల శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వానికి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణలో శాసన మండలి సీటుకు జనసేన పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇతర పార్టీల కంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించింది జనసేన.

Advertisement

 

తొలిసారి బరిలోకి జనసేన, అభ్యర్థిగా శ్రీనివాస్ ఖరారు

ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో సెప్టెంబర్ 13న ఖమ్మంలో జనసేన-శంఖారావం పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ వెల్లడించాడు. ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేడర్‌కు సంకేతాలు ఇచ్చింది. తెలంగాణలో పార్టీ విస్తరణకు ఇదొక తొలిమెట్టుగా భావిస్తోంది ఆ పార్టీ.

ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ గడల శ్రీనివాసరావు, పట్టభద్రులు-ఉద్యోగులు-నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై మండలిలో గళం వినిపిస్తానన్నారు. తనను గెలిపిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జనసేన పార్టీని గమనించినవాళ్లు.. తమిళనాడులోని టీవీకే పార్టీ విధంగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. విజయ్ పార్టీ.. నేరుగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి అధిక స్థానాలను గెలుచుకుంది.

ALSO READ: ఆటో సంఘాలతో చర్చలు సఫలం.. కార్మిక సంఘాలకు మంత్రి పొన్నం ధన్యవాదాలు

పుష్కరకాలం కిందట పార్టీని పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, విస్తరించే క్రమంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇటీవలకాలంలో జెన్ జీ ఉద్యమాలు ఊపందుకోవడం, తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేతను  పార్టీలు పదేపదే ప్రస్తావించడంతో ప్రచారం బాగా వచ్చింది. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు సొంతూరు ఖమ్మం జిల్లా. ఈ లెక్కన జనసేన ఏ పార్టీ ఎవరి ఓట్లను చీల్చుతుందో చూడాలి.

Related News

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

హైదరాబాద్‌వాసులపై అధికారులు నిఘా.. ఓ వ్యక్తికి రూ.20 వేల జరిమానా, నీటిని వృథా చేసినందుకు

గ్లోబల్ సంస్థలకు తెలంగాణలో తిరుగులేని ఆఫర్లు.. ఐటీ శాఖ రోడ్‌మ్యాప్ ఇదే?

తెలంగాణలో కాంగ్రెస్ భారీ ఆందోళనకు పిలుపు.. ‘చలో రాజ్‌భవన్’ ఎప్పుడంటే?

తెలంగాణలో రోడ్డు ప్రమాదాల కట్టడికి జీఓ.. డీజీపీ ఆనంద్ బిగ్ ప్లాన్!

పీఎం శ్రీ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

దుర్గామాత మండపాల నిర్వాహకులు షాకింగ్ న్యూస్.. రూల్స్ పాటించాల్సిందే?

దసరాకు ఊరెళ్లేవారికి తీపి కబురు.. 7 వేల ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఉచితం యథాతథం!

Big Stories

Advertisement
×