E-Paper
Advertisement

చెత్త కుప్పల నుంచి పచ్చని పార్కుగా.. భద్రాచలం గోదావరి కరకట్ట సుందరీకరణ!

చెత్త కుప్పల నుంచి పచ్చని పార్కుగా.. భద్రాచలం గోదావరి కరకట్ట సుందరీకరణ!
Advertisement

Bhadrachalam Greenery: స్వేచ్చ బ్యూరో: శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న భద్రాచలానికి దేశ విదేశాల నుండి భక్తులు అధికంగా వచ్చి దర్శనం చేసుకుని పునీతులు అవుతారని, భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరడానికి గోదావరి కరకట్ట ప్రాంత ఖాళీగా ప్రదేశంలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవడంతో నేడు ఆ ప్రదేశమంతా పచ్చదనంతో కళకళలాడుతుంది. దీనికి చర్యలు తీసుకున్న భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల శ్రేష్ట ప్రశంసలు అందు కుంటున్నారు.

గోదావరిలో పుణ్యస్నానాలు..

భద్రాచలం పట్టణంలోని కరకట్ట చివర ప్రాంతంలో గతంలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాల కారణంగా తీవ్ర దుర్వాసన వెదజల్లుతూ, గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులు ఈ దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. భద్రాద్రి పట్టణంలోని చెత్తను ఆ ప్రాంతంలో డంపింగ్ చేయడంతో కరకట్ట పరిసరాలు అపరిశుభ్రంగా అధ్వానంగా మారాయి. గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రత్యేక చొరవతో గ్రామపంచాయతీ సిబ్బంది చేత ఆ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పరిసరాలను శుభ్రపరిచారు.

Advertisement

Also read: బీసీసీఐకి ఎదురుదెబ్బ‌..ACC ఎన్నిక‌ల్లో ఇండియాపై పాకిస్తాన్ విజ‌యం

నేడు పచ్చదనంతో..

పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు చేపట్టారు. చెత్తకుప్పలతో, దుర్వాసనతో కనిపించిన ప్రాంతం కేవలం పది నెలల తర్వాత ప్రస్తుతం పచ్చని మెక్కలు, గడ్డితో ఆహ్లాదకరమైన వాతావరణంగా మారింది. గతంలో చెత్త డంపింగ్ యార్డుగా కనిపించిన ప్రాంతం నేడు పచ్చదనంతో కళకళలాడుతుండటంపై స్థానికులు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి స్నానఘట్టాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైను వాతావరణం కల్పించడంలో భద్రాద్రి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తో పాటు సబ్ కలెక్టర్ మృణాల్ జేష్ఠ తీసుకున్న చర్యలు అభినందనీయమని స్థానికులు హర్షం వ్యక్తంచేశారు.అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు సమన్యయంతో ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమాలను కొనసాగిస్తే భద్రాచలం మరింత సుందరంగా మారుతుందని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

 Also Read: 75 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో..గోబౌల్ట్ ఇయర్‌ బడ్స్!

Tags

Related News

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

హైదరాబాద్‌వాసులపై అధికారులు నిఘా.. ఓ వ్యక్తికి రూ.20 వేల జరిమానా, నీటిని వృథా చేసినందుకు

గ్లోబల్ సంస్థలకు తెలంగాణలో తిరుగులేని ఆఫర్లు.. ఐటీ శాఖ రోడ్‌మ్యాప్ ఇదే?

తెలంగాణలో కాంగ్రెస్ భారీ ఆందోళనకు పిలుపు.. ‘చలో రాజ్‌భవన్’ ఎప్పుడంటే?

తెలంగాణలో రోడ్డు ప్రమాదాల కట్టడికి జీఓ.. డీజీపీ ఆనంద్ బిగ్ ప్లాన్!

పీఎం శ్రీ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

దుర్గామాత మండపాల నిర్వాహకులు షాకింగ్ న్యూస్.. రూల్స్ పాటించాల్సిందే?

దసరాకు ఊరెళ్లేవారికి తీపి కబురు.. 7 వేల ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఉచితం యథాతథం!

Big Stories

Advertisement
×