E-Paper
Advertisement

మంత్రి ఉత్తమ్ సాగర్‌లో దూకండి నీళ్లున్నాయో లేదో తెలుస్తుంది: జగదీష్ రెడ్డి!

మంత్రి ఉత్తమ్ సాగర్‌లో దూకండి నీళ్లున్నాయో లేదో తెలుస్తుంది: జగదీష్ రెడ్డి!
Advertisement

Telangana Farmers: స్వేచ్ఛ బ్యూరో: రైతులకు నీళ్లు ఇస్తే పండిన పంటను కొనుగోలు చేయాల్సి వస్తుందని.. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని అందుకే వివక్ష చూపుతుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బిజెపి కలిసి ఆడిన నాటకం ద్రోహం ఇప్పుడు తేట తెల్లం అయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిల్ల, అన్నారం బ్యారేజ్‌ల పై సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌తో కలిసి ఆడుతున్న నాటకం తేట తెల్లం అయిందని, మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా కన్నేపల్లి పంపు హౌస్ ఆన్ చెయ్యండని కేటీఆర్ అనేక సార్లు చెప్పిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

చెప్పిన అబద్ధమే చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ డిఎస్ ఏ  సాకు చెప్పిందని విమర్శించారు. కమిషన్ లకు అలవాటు పడ్డ ఈ ప్రభుత్వం లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వడం లేదన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఏ విధంగా దోచుకుంటున్నారో  వాస్తవాలు ప్రజలకు చూయించినఅన్నారు. రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోతిరెడ్డిపాడు బొక్కతో అంతులేకుండా నీళ్లను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్తుందని, పోతిరెడ్డిపాడు నుంచి వరద జలాలను మాత్రమే తీసుకొని పోవాలన్నారు. దుర్మార్గంగా 140 టీఎంసీల నీళ్ళను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీళ్లను తీసుకొని పోయిందన్నారు. సాగర్ లో ఇప్పటివరకు 175 టీఎంసీ ల నీళ్ళు ఉన్నాయి.

 518 అడుగుల నీళ్ళు..

Advertisement

110 టీఎంసీల నీళ్ళు వచ్చి ఉంటే సాగర్ నిండేదని, నాగార్జున సాగర్ లో ఎడమ కాల్వ క్రింద ఉండే పంటలకు సరిపడే నీళ్ళు ఉండేవన్నారు. నాగార్జున సాగర్ లో 518 అడుగుల నీళ్ళు ఉన్నప్పుడే ఎడమ కాల్వ క్రింద సాగునీరు ఇచ్చామని, సాగర్ లో 510 అడుగుల నీళ్ళు ఉన్నప్పుడే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎడమ కాల్వ క్రింద సాగునీరు ఇచ్చాడన్నారు. పెన్నా బేసిన్ లో వరద రాకున్నా రాయలసీమలో  52 శాతం వర్షపాతం తక్కువ ఉన్న..మహబూబ్ నగర్ పరిధిలో ఉండే పంపులు ఇంతవరకు ఆన్ చెయ్యలేదన్నారు. ఈ ప్రభుత్వం గోదావరి ,  కృష్ణాలో ద్రోహం చేస్తుందని, నీళ్లు ఇస్తే కరెంట్ కొనాలని పంటలు వేస్తే ఎరువులు ఇవ్వాల్సి వస్తుందని ఈ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం లేదని ఆరోపించారు.

Also Read: ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్!

దుర్మార్గమైన ఆలోచన..

Advertisement

పంట కొంటే బోనస్ ఇవ్వాలి అందుకే ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో నీళ్ళు ఇవ్వడం లేదు.. ఎల్ నినో పేరుతో దుర్మార్గమైన ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. నీళ్ళు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతు పరిస్థితి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉండే దానికంటే ఎక్కువ అద్వాన్నం అయిపోయిందని, రైతులకు ఎల్ నినో పెట్టిన శాపం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శాపం.. పోలవరం నుంచి పట్టిసీమ నుంచి బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయి.

నీళ్ళు ఇవ్వొచ్చు కదా..!

కన్నేపల్లి పంపులు ఆన్ చేసి ఉంటే మల్లన్న సాగర్ , కొండ పోచమ్మ , రంగనాయక సాగర్ నిండేవి.. ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కేసీఆర్ కు క్షమాపణలు చెప్పి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎల్ నినో ప్రభావం దేశ వ్యాప్తంగా ఉంది. ఉన్నటువంటి నీళ్లను వాడుకొని రైతులకు నీళ్ళు ఇవ్వొచ్చు కదా…! ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యాన్ని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి బయట పెట్టాడన్నారు. నాగార్జున సాగర్ నిండిన రైతులకు నీళ్ళు ఇయ్యమని మంత్రి కోమటి రెడ్డే చెప్పాడని, ఆరుతడి పంటలు ఏం వేసుకోవాలో ఏ జిల్లాలో ఏం పంటలు పండుతాయిని మంత్రులు ఒక్కరంటే ఒక్కరు చెప్పినవారు లేరన్నారు. ఏ గింజ పెట్టుకోవాలన్న నీళ్ళు కావాలి, రైతులకు నీళ్ళు ఎలా ఇస్తారు.

ఎల్ నినో..

ఎల్ నినో టైంలో రైతులకు పంట పండించుకునే అవకాశం ఇస్తే.. ఓపెన్ మార్కెట్ లో పంటకు డిమాండ్ ఉండేది కదా! భూ భారతి తో వచ్చిన సంక్షోభమే మంత్రుల మధ్య పంచాయతీ.. మంత్రుల పంచాయతీ పై మీడియా  చర్చించుకుంటున్నటే కాంగ్రెస్ పార్టీలో ఉండే వారు చర్చ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ లో సంక్షోభానికి బీ ఆర్ ఎస్ వైసీపీల కుట్ర ఉందని కొందరు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా నయం ట్రంప్ ,పుతిన్ లాంటి వాళ్ళ కుట్ర ఉందని అనలేదు అని ఏద్దేవా చేశారు. సమావేశాలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ,మాజీ ఎమ్మెల్యేలు ఎన్ .భాస్కర్ రావు ,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ,గాదరి కిషోర్ కుమార్ ,పైలా శేఖర్ రెడ్డి ,నోముల భగత్ పాల్గొన్నారు.

Also Read: కెఫిన్ మోతాదు ఎక్కువైతే మహిళల్లో.. హార్మోన్ల అసమతుల్యత తప్పదా ? అసలు నిజాలివే!

Tags

Related News

మల్లారెడ్డి యూనివర్సిటీలో అపశ్రుతి.. స్పీకర్లు పడి విద్యార్థులకు గాయాలు!

తెలంగాణ రైజింగ్ కు గ్లోబల్ అంబాసిడర్లుగా మారండి ఎన్ఆర్ఐలకు సీఎం రేవంత్ పిలుపు!

చెత్త కుప్పల నుంచి పచ్చని పార్కుగా.. భద్రాచలం గోదావరి కరకట్ట సుందరీకరణ!

విద్యార్థుల సమస్యలపై బీజేపీ సమరశంఖం.. 2 రోజులపాటు నిరాహార దీక్ష!

పార్టీకి డ్యామేజ్ చేస్తే చర్యలు తప్పవు.. వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

అంజయ్య నగర్ ప్రమాదంలో బయటపడ్డ సంచలనాలు.. బిల్డర్ సాజిద్ అక్రమాల చిట్టా రట్టు!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నగదు రహిత వైద్యం పై ఫోకస్!

Big Stories

Advertisement
×