E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను మాలిని ఇంట్లో చూసిన కార్తీక్      

Karthika Deepam 2 Serial Today Episode August 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను మాలిని ఇంట్లో చూసిన కార్తీక్      
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  శివనారాయణ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడే జ్యోత్స్న కాంచన దగ్గరకు వెళ్లి తనను పెళ్లి అయిన తర్వాత మర్చిపోతారా..? అని ఎమోషనల్‌ అవుతూ అడుగుతుంది. జ్యో మాటలకు కాంచన ఆశ్చర్యపోతుంది.

అలా అంటావేంటే..? పెళ్లి అయ్యాక నువ్వు సూరజ్‌ ఎక్కడికి వెళ్తారు.. ఇక్కడే మన ఇంట్లోనే మా కళ్ల ముందే ఉంటారు కదా అంటూ జ్యోత్స్నను హగ్‌ చేసుకుంటూ.. మీరు ఎక్కడికి వెళ్లరు.. ఇక్కడే ఉంటారు.. అంటుంది. అంతా గమనిస్తున్న దశరథ, కార్తీక్ తో జ్యోత్స్న ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అడిగితే.. పెళ్లి అయ్యాక తాను మీ కన్న బిడ్డ కాదన్న నిజం చెప్తానంది అంటాడు కార్తీక్‌. దశరథ ఆశ్చర్యంగా అవునా..? అంటూ జ్యోత్స్న దగ్గరకు వెళ్లి  నువ్వు ఎక్కడికీ వెళ్లవమ్మా.. పెంచిన కూతురు.. కన్న కూతురు అనేం ఉండదు.. అయినా కన్న కూతురి కంటే పెంచిన కూతురే ఎక్కువ కదా అంటాడు దశరథ్‌.

Advertisement

తర్వాత జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లి శుభలేఖలు వస్తాయి. అవి చూసిన శివనారాయణ దీపను మొదటి శుభలేక తీయమని ఎలా ఉన్నాయో చూద్దామని చెప్తాడు. దీప శుభలేక తీయగానే.. అందరూ చూస్తారు. చాలా బాగున్నాయని.. అనుకుంటారు. అప్పుడే మొదటి శుభలేక మాలినికి ఇవ్వాలని జ్యోత్స్న గుర్తు చేస్తుంది. అవునని శివనారాయణ అంటాడు. ఇవాళే వెళ్లి మాలినికి మొదటి శుభలేఖ ఇద్దామని జ్యోత్స్నకు చెప్తాడు. జ్యో సరే అంటుంది.

తర్వాత దీప పెళ్లి పనులు చేస్తుంటే.. కార్తీక్‌ వెళ్లి  జ్యోత్స్న పెళ్లి కోసం ఇంత కష్టపడుతున్నావు.. ఒకవేళ జ్యోత్స్న నీ సొంత చెల్లి అయ్యుంటే.. అని అడిగితే.. దీప ఎమోషనల్‌ అవుతూ..  తనకు తోడబుట్టిన వాళ్లు లేరని జ్యోత్స్న తన సొంత చెల్లేనని.. జ్యోత్స్న పెళ్లి బాధ్యత తనదేనని చెప్తుంది దీప. దూరం నుంచి దీప మాటలు విన్న జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. దీప దగ్గరకు వెళ్లి హగ్‌ చేసుకుని కన్నీళ్లతో.. ఇన్నాళ్లు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు మా జీవితాల్లోకి వచ్చి నా జీవితం లాగేసుకున్నావ్ అనుకున్నాను.. అదో మూర్ఖత్వం అదో పంతం.. బావని నేను ప్రేమిస్తున్నానో లేదో ఆలోచించలేదు.. బావ కావాలి అంతే.. బావకి నేను కావాలో లేదో కూడా ఆలోచించలేదు..

Advertisement

అప్పుడే నువ్వు సొంత కూతురు అని తెలిసింది.. నా భయం ఇంకా పెరిగిపోయింది.. సూరజ్ వల్లే నేను రియలైజ్ అయ్యాను.. వాడే నన్ను మార్చేశాడు.. నేను మారిపోయినంతలా నా చేతలు మారిపోవు కదా..  నీ విషయంలో చేసిన తప్పులు పెళ్లికి ముందే కడిగేసుకోవాలి అనుకుంటున్నా అందుకే ఓ పని చేయాలి అనుకుంటున్నా అని చెప్పగానే.. ఏంటని దీప అడుగుతుంది… జ్యోత్స్న వెంటనే దీప కాళ్లు పట్టుకుని క్షమించమని అడుగుతుంది. జ్యోత్స్న చేతలకు కార్తీక్‌, దీప షాక్‌ అవుఆతారు. దూరం నుంచి చూసిన పారిజాతం ఆశ్చర్యపోతుంది. దీపకు ఏం చేయాలో అర్థం కాక ఏంటి జ్యోత్స్న అసలు నువ్వు నువ్వేనా అని అడుగుతుంది. పారిజాతం కూడా నాకు అదే డౌటుగా ఉందని చెప్తుంది.  దీప మాత్రం జ్యోత్స్నను మనఃస్పూర్తిగా క్షమిస్తున్నానని పైకి లేపి హగ్‌ చేసుకుంటుంది.

తర్వాత శివనారాయణ, కార్తీక్‌, దీప, జ్యోత్స్సలు కలిసి దక్షిణమూర్తి ఇంటికి వెళ్లి మొదటి శుభలేఖ ఇస్తారు. అది చూసిన మాలిని ఒక అనాథకు నీ మనవరాలిని ఇస్తున్నావా..? అంటూ వెటకారంగా మాట్లాడతాడు. జ్యోత్స్న తాను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నానని చెప్తుంది. శుభలేఖ ఇచ్చి వెళ్లిపోతారు. శివనారాయణ వాళ్లు వెళ్లిపోయాక  మాలిని, దక్షిణమూర్తి శుభలేఖ చూసి నవ్వుకుంటారు. బయటకు వెళ్లిన కార్తీక్‌ స్కూటీ తాళాలు మర్చిపోయానని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తుంటే.. ఒక రూంలో సూరజ్‌ ఫోన్‌ మాట్లాడుతూ కనిపిస్తాడు. కార్తీక్‌ కన్పీజ్‌గా సూరజ్‌కు ఫోన్‌ చేస్తాడు. ఫోన్‌ రూంలోనే రింగ్‌ అవుతుంది. కానీ లిఫ్ట్‌ చేయరు. కార్తీక్‌ అనుమానంగా డోర్‌ తెరవమని పిలుస్తాడు. కొద్ది సేపటికి రూం ఒపెన్‌ అవుతుంది. ఎవరో బాయ్‌ ఏసీ రిపేర్‌ చేస్తున్నాను అంటూ డోర్‌ తెరుస్తాడు. అప్పుడే సూరజ్‌, కార్తీక్‌కు ఫోన్‌ చేస్తాడు. ఎక్కడున్నావని కార్తీక్‌ అడిగితే బస్టాప్‌ దగ్గర కాఫీ తాగుతున్నానని చెప్తాడు సూరజ్‌.

తర్వాత రూంలో ఉన్న సూరజ్‌ దగ్గరకు వెళ్తుంది జ్యోత్స్న రేపే మన పెళ్లి జరుగబోతుందని.. సూరజ్‌తో రొమాంటిక్ గా మాట్లాడుతుంది. సూరజ్‌ మాత్రం జ్యోత్స్న ఎన్ని మాటలు మాట్లాడినా మౌనంగా ఉంటాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Ninnu kori Serial Today Episode October 8th ‘నిన్ను కోరి’ సీరియల్‌: గతం గుర్తుకు వచ్చిన విరాట్ ఏం చేశాడో తెలుసా..? 

Big Stories

Advertisement
×