E-Paper
Advertisement

విద్యార్థుల సమస్యలపై బీజేపీ సమరశంఖం.. 2 రోజులపాటు నిరాహార దీక్ష!

విద్యార్థుల సమస్యలపై బీజేపీ సమరశంఖం.. 2 రోజులపాటు నిరాహార దీక్ష!
Advertisement

Fee Reimbursement: విద్యార్థుల సమస్యలపై రేపు బిజెపి కార్యాలయం ముందు రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు 12 వేల కోట్లు ఉన్నాయని, విద్యాసంస్థలు జీతాలు ఇవ్వాలేని పరిస్థితిలో ఉన్నాయి. పోలీసులు నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వడంలేదని అన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా పార్టీ కార్యాలయం లోపల చేస్తామని అన్నారు.

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు..

గత BRS హయంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 4 వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని తెలిపారు. హైకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని అన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రభుత్వాన్ని హైకోర్టు నడిపిస్తుంది. కాంగ్రెస్ అవినీతికి మారుపేరని అన్నారు. గతంలో బి.ఆర్ ఎస్ వారి కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నారన్న అభియోగం ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సోదరుల మీద ఆరోపణలు వస్తున్నాయన్నారు.

Advertisement

Also read; ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ తో రిలేషన్ ఎప్పటినుండో తెలుసా ?

తెలంగాణకు రండి..

గతంలో కొండా సురేఖ ఓ ఎస్ డి ఒక కంపెనీ వ్యక్తిపై తుపాకీ పెట్టీ బెదిరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమిషన్లు వసూలు చేస్తుందని అన్నారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో ఛత్రోంకి గుంజ్ పెట్టాలన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలని ఛాలెంజ్ చేస్తున్నానన్నారు. ఒక్క విద్యార్థి కూడా తెలంగాణకు రాహుల్ గాంధీని రానివ్వడని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగుపెడితే విద్యార్థులే అడ్డుకుంటారని అన్నారు.

Advertisement

Also Read: అంజయ్య నగర్ ప్రమాదంలో బయటపడ్డ సంచలనాలు.. బిల్డర్ సాజిద్ అక్రమాల చిట్టా రట్టు!

Tags

Related News

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

హైదరాబాద్‌వాసులపై అధికారులు నిఘా.. ఓ వ్యక్తికి రూ.20 వేల జరిమానా, నీటిని వృథా చేసినందుకు

గ్లోబల్ సంస్థలకు తెలంగాణలో తిరుగులేని ఆఫర్లు.. ఐటీ శాఖ రోడ్‌మ్యాప్ ఇదే?

తెలంగాణలో కాంగ్రెస్ భారీ ఆందోళనకు పిలుపు.. ‘చలో రాజ్‌భవన్’ ఎప్పుడంటే?

తెలంగాణలో రోడ్డు ప్రమాదాల కట్టడికి జీఓ.. డీజీపీ ఆనంద్ బిగ్ ప్లాన్!

పీఎం శ్రీ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

దుర్గామాత మండపాల నిర్వాహకులు షాకింగ్ న్యూస్.. రూల్స్ పాటించాల్సిందే?

దసరాకు ఊరెళ్లేవారికి తీపి కబురు.. 7 వేల ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఉచితం యథాతథం!

Big Stories

Advertisement
×