E-Paper
Advertisement

Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు

Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు
Advertisement

Heavy Rains in Telangana: రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది.

ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Advertisement

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో గురువారం రాత్రి వర్షం దంచికొట్టింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సాయంత్రం నుంచి వర్షం కురవడంతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. పలు చోట్లు డ్రెయినేజీలు పొంగిప్రవహించడంతో పాటు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నేడు, రేపు కూడా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Also Read: సెలవురోజని బయటకెళ్లిన నగరవాసులు.. ఇంతలోనే భారీ షాక్

Advertisement

భారీ వర్షాల సూచనపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్పందించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయలకు రావొద్దని సూచించారు. భారీ వర్షల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే 040-21111111 / 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.

Related News

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

1980s ట్రెండ్.. అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్

అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం

మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

ఏఐసీసీలో తెలంగాణకు ప్రయార్టీ.. మధుయాష్కీకు కీలక పదవి, ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ హైకమాండ్ నియామకం

Big Stories

Advertisement
×