E-Paper
Advertisement

కాంగ్రెస్ నేతలు ఒసామా బిన్ లాడెన్ వారసులు.. రేవంత్ రెడ్డికి రామచందర్ రావు స్ట్రాంగ్ కౌంటర్!

కాంగ్రెస్ నేతలు ఒసామా బిన్ లాడెన్ వారసులు.. రేవంత్ రెడ్డికి రామచందర్ రావు స్ట్రాంగ్ కౌంటర్!
Advertisement

Ramchander Rao: బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎన్. రామచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అవినీతిరహిత పాలన అందిస్తూ.. దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నడిపిస్తోందని కొనియాడారు.

కేంద్ర నిధులు.. అభివృద్ధి

Advertisement

2014కు ముందు దేశంలో అనేక కుంభకోణాలు చూశామని, మోదీ ప్రధాని అయ్యాక దళారీ వ్యవస్థను అంతమొందించి లబ్ధిదారులకు నేరుగా ఫలాలు అందిస్తున్నారని తెలిపారు. గడిచిన 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని, ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 41 రైల్వే స్టేషన్లను ఆధునీకరించినట్లు చెప్పారు. రోడ్లు, రైల్వేలు, ఎయిర్ వేస్ రవాణా వ్యవస్థలు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు

Advertisement

గోవాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రాముడు కాదని.. ఆ పార్టీ రావణుడు, రాక్షసుడు అవుతుందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు ఒసామా బిన్ లాడెన్ వారసులు అంటూ ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ‘కాంగ్రెస్ అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్ అని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు రాముడి పేరు ఎత్తడం విడ్డూరంగా ఉందన్నారు. హిందువుల భావోద్వేగాలతో ఆడుకోవద్దని, దేవుళ్లను ఎగతాళి చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ఆయనను తెలంగాణలో తిరగనివ్వమని స్పష్టం చేశారు.

రైతుల సమస్యలు.. డ్రగ్స్ మహమ్మారి

రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉండి ప్రాణాలు వదులుతుంటే, ముఖ్యమంత్రి , మంత్రులు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లడం శోచనీయమని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ‘ఫసల్ బీమా యోజన’ను అమలు చేసి రైతులను ఆదుకోవాలని, లేకపోతే బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ డ్రగ్స్‌కు కేంద్రబిందువుగా మారుతోందని, రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి రాజకీయ డ్రామాలుడుతున్నారని రామచందర్ రావు విమర్శించారు.

Also Read: దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఇల్లు అమ్ముతానని రూ.31.77 లక్షలు వసూలు.. మరో బ్యాంకులో తనఖా!

ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

కమీషన్ల కోసమే యాదాద్రి పవర్ ప్లాంట్.. బీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

బోరబండలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని చిన్నారి మృతి!

ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఈసీ తరహా పవర్స్ ఉండాలి: కల్వకుంట్ల కవిత

ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా? రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×