E-Paper
Advertisement

వందే భారత్ సరికొత్త రికార్డు.. 180 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ సక్సెస్!

వందే భారత్ సరికొత్త రికార్డు.. 180 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ సక్సెస్!
Advertisement

Vande Bharat Express at 180 kmph: భారతీయ రైల్వేలో హైస్పీడ్ ప్రయాణాల దిశగా మరో కీలక అడుగు పడింది. మధుర–నాగ్దా రైల్వే సెక్షన్‌లో 16 కోచ్‌ల వందే భారత్ చైర్ కార్ రైలును గంటకు 180 కిలోమీటర్ల వేగంతో అధికారులు పరీక్షించారు. అక్టోబర్ 8, 2026న చీఫ్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CCRS) పర్యవేక్షణలో ఈ ట్రయల్ నిర్వహించినట్లు వెల్లడించారు. వందే భారత్ రైళ్లు ఇకపై ఇదే వేగంతో ప్రయాణిస్తాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మధుర–నాగ్దా సెక్షన్‌లో హైస్పీడ్ ట్రయల్!

మధుర–నాగ్దా రైల్వే మార్గం ఢిల్లీ–ముంబై రైల్ కారిడార్‌లో కీలకమైన భాగం. ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను లింక్ చేసే ఈ మార్గంలో రైళ్ల వేగ సామర్థ్యాన్ని పరీక్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పంజాబ్‌లోని కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF)లో తయారైన 16 కోచ్‌ల వందే భారత్ రైలుతో ఈ పరీక్ష నిర్వహించారు. రైలు హైస్పీడ్ లో ప్రయాణిస్తున్నప్పుడు దాని పనితీరు, స్థిరత్వం, ప్రయాణ నాణ్యత, భద్రతా వ్యవస్థలను పరిశీలించారు.

Advertisement

వందే భారత్ రైళ్లకు గంటకు 180 కిలోమీటర్ల డిజైన్ స్పీడ్ ఉంటుంది. అయితే, సాధారణ ప్రయాణాల్లో వీటి గరిష్ట నిర్వహణ వేగం గంటకు 160 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ట్రయల్‌ లో గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడంతో ఇకపై అవసరం అయితే, అదే స్పీడ్ తో నడిపే అవకాశం ఉంటుంది.  అయితే, గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ నిర్వహించడం, సాధారణ సర్వీసుల్లో అదే వేగాన్ని అనుమతించడం రెండూ వేర్వేరు విషయాలు. ప్రతి మార్గంలోని మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు, రైల్వే అనుమతులను బట్టి వేగం నిర్ణయిస్తారు.

ప్రయాణికులకు కలిగే లాభం ఏంటి?   

రైల్వే ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థలు, భద్రతా పరికరాలు హైస్పీడ్ కు అనుగుణంగా ఉంటే భవిష్యత్తులో ప్రయాణ సమయాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. భారతీయ రైల్వే ట్రాక్‌ల ఆధునీకరణపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఇటువంటి హైస్పీడ్ ట్రయల్స్ భవిష్యత్తులో వేగవంతమైన రైలు ప్రయాణాలకు మార్గం సుగమం చేయవచ్చు. అయితే, ప్రయాణికులకు ఈ  ప్రయోజనం ఎప్పటి నుంచి అందుతుందనేది అధికారిక అనుమతులు, ఆ తర్వాతి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

Advertisement

Read Also: సౌదీ అరేబియాకు వెళ్లొద్దు.. హౌతీ దాడులతో పలు దేశాల హెచ్చరికలు!

Tags

Related News

ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. గుంటూరు నుంచి స్పెషల్ రైలు!

సౌదీ అరేబియాకు వెళ్లొద్దు.. హౌతీ దాడులతో పలు దేశాల హెచ్చరికలు!

పెంగ్విన్ల మలంతో కరుగుతున్న మంచు.. అంటార్కిటికాలో వింత పరిణామం!

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 25 గంటల తర్వాత అన్ని స్టేషన్లు ఓపెన్!

రైళ్ల రద్దుపై కీలక అప్‌డేట్.. ఇండియన్ రైల్వే ఏం చెప్పిందంటే!

రన్నింగ్ ట్రైన్ లోనూ కన్ఫార్మ్ టికెట్ పొందొచ్చు, IRCTCలో ఈ సింపుల్ ట్రిక్ ఫాలోకండి!

బ్లింకిట్ గా మారిపోయిన ఇండియన్ రైల్వే.. రిక్వెస్ట్ పెట్టిన 10 నిమిషాల్లోనే డైపర్లు వచ్చేశాయ్!

Big Stories

Advertisement
×