Pakistan Fans Supports IND Team: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పోరులో భారత జట్టు తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 228 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనలో భారత జట్టు 47 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. గ్రూప్ – ఏ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు జరగడంతో.. ఈ గ్రూపులో సెమీఫైనల్స్ సమీకరణాలు రూపుదిద్దుకోవడం ప్రారంభించాయి.
భారత్ తన తొలి మ్యాచ్ లో విజయం సాధించడంతో రెండు పాయింట్లు సాధించింది. ఇక బంగ్లాదేశ్ జట్టుకి ఏమి లభించలేదు. గ్రూప్ – ఏ లో న్యూజిలాండ్ తర్వాత భారత్ రెండవ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ తన మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ ని 60 పరుగులు తేడాతో ఓడించడంతో.. రన్ రేట్ + 1.200 తో మొదటి స్థానంలో ఉండగా.. + 0.408 తో భారత జట్టు రెండవ స్థానంలో ఉంది. ఇక బంగ్లాదేశ్ మూడవ స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ అట్టడుగున నిలిచింది. ఇక ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్ధులు భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగబోతోంది.
ఆదివారం దుబాయ్ వేదికగా ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాళ్లు.. పాకిస్తాన్ నుండి దుబాయ్ చేరుకున్నారు. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్.. భారత్ తో ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతుంది. అయితే ఈ మ్యాచ్ కి ముందు పాకిస్తాన్ క్రీడాభిమానులు ఏకంగా వారి జట్టు పరువునే తీసేస్తున్నారు.
భారత జట్టుపై పాకిస్తాన్ ఎట్టి పరిస్థితిలో గెలవలేదని.. కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఎంతో పటిష్టంగా ఉందని పాకిస్తాన్ క్రీడాభిమానులు చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ పాకిస్తాన్ క్రీడాభిమాని మాట్లాడుతూ.. భారత జట్టును, పాకిస్తాన్ జట్టును కంపేర్ చేయలేమని.. ఇది చాలా బాధాకరమైన విషయం అని అన్నాడు. భారత జట్టు చాలా పటిష్టంగా ఉందని, పాకిస్తాన్ మాత్రమే కాదు మరే జట్టు.. భారత జట్టుపై గెలుపొందలేదని అన్నాడు. నిజం చెప్పాలంటే భారత జట్టు వేరే లెవెల్ లో ఉందని.. భారత జట్టు ముందు పాకిస్తాన్ జట్టు చిన్న పిల్లలలాంటిదని అన్నాడు.
దీంతో పాకిస్తాన్ క్రీడాభిమాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రీడాభిమానులు మన జట్టుని పొగుడుతుంటే వచ్చే ఆనందమే వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు భారత అభిమానులు. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ సెమీఫైనల్ చేరుకోవాలంటే భారత జట్టును ఓడించాలి. అంతేకాకుండా బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్ ని ఓడించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ జట్టు టీమ్ ఇండియా చేతిలో ఓడిపోతే అది సెమీఫైనల్స్ నుంచి నిష్క్రమించడం ఖాయం.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">