Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఉద్యోగులకు డీఏ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే మెట్రో రెండో విడత విస్తరణపై కూడా సమావేశంలో చర్చించారు. అలాగే రాజీవ యువ వికాసం స్కీంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.
ఉద్యోగుల డిమాండ్ల పై సుదీర్ఘంగా కేబినెట్‌లో చర్చించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తమ నివేదికపై మాట్లాాడారు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, ఆరోగ్య భద్రత, పెండింగ్ బిల్లుల విషయంలో తీసుకోవాల్సిన కార్యాచరణపై మంత్రి వర్గం చర్చించింది. స్థానిక ఎన్నికల పై సుధీర్ఘంగా సమాలోచనలు చేశారు. కాళేశ్వరంపై విజిలెన్స్, NDSA రిపోర్ట్ పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. పులిచింతల లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్ట్ లపై క్యాబినెట్ లో చర్చించారు. మహిళా సంఘాల భీమా నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ములుగులో పామాయిల్ ఫాక్టరీకి 12ఎకరాల కేటాయించాలని కేబినెట్ లో నిర్ణయించారు.
ALSO READ: Weather News: మరి కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. పిడుగులు పడే ఛాన్స్