OTT Movie : మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఈ సినిమాలకు ఇప్పుడు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా గోల్డ్ స్మగ్లింగ్ తో మొదలౌతుంది. ఆ తరువాత ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. చివరిదాకా సస్పెన్స్ తో ఉత్కంఠంగా సాగుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
స్టోరీలోకి వెళితే
ముత్తు, కన్నన్ అనే ఇద్దరు వ్యక్తులు త్రిస్సూర్ లో బంగారు వ్యాపారం చేస్తుంటారు. వీళ్ళు బంగారు ఆభరణాలను తయారు చేసి, దేశవ్యాప్తంగా జ్యువెలరీ షాపులకు సరఫరా చేస్తుంటారు. ముత్తు బంగారు ఆభరణాలు తయ్యారు చేస్తుంటే, కన్నన్ వాటిని ముంబై వంటి నగరాలకు రవాణా చేస్తుంటాడు. వీళ్ళ వ్యాపారం కొంత లొసుగులతో కూడి వుంటుంది. అయితే ఇది అనుకోని సమస్యలను తెచ్చిపెడుతుంది. ఒక రోజు కన్నన్, ముత్తు మరొక స్నేహితుడితో కలిసి కోయంబత్తూర్‌కు బంగారు డెలివరీ కోసం వెళతారు. అక్కడ పనయ్యాక, కన్నన్ ముంబైకి ఒంటరిగా ప్రయాణిస్తాడు. కానీ అతను అకస్మాత్తుగా కనిపించకుండా పోతాడు. తరువాత అతను ఒక హోటల్ గదిలో చనిపోయి కనిపిస్తాడు. గదిలో తాళం బయట నుండి వేసి ఉంటుంది. గదిలో రక్తం చెల్లా చెదురుగా ఉండటం, కన్నన్ శరీరంపై గాయాలు ఉండటం వల్ల అతను హత్య చేయబడినట్లు పోస్ట్‌మార్టం నివేదిక తెలియజేస్తుంది.
అతనితో ఉన్న 8 కిలోల బంగారం కూడా కనిపించకుండా పోతుంది. ఈ కేసును ముంబై పోలీసు అధికారి జయంత్ సఖల్కర్ (గిరీష్ కులకర్ణి) దర్యాప్తు చేస్తాడు. ముత్తు అతని సహచరులు కన్నన్ మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి పోలీసులతో కలిసి పనిచేస్తారు. దర్యాప్తు కేరళ, తమిళనాడు, ముంబైకి విస్తరిస్తుంది. చివరికి కన్నన్ ను చంపింది ఎవరు ? బంగారం ఎక్కడ దాచారు ? ముత్తు ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : గజగజ ఓణికిపోయే హారర్ మూవీ.. సినిమా చూస్తూనే మరణం.. దైర్యం ఉంటేనే చూడాలి!
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘తంకం’ (Thankam). 2023 లో విడుదలైన ఈ సినిమాకి సైహీద్ అరాఫత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ త్రిస్సూర్‌లోని బంగారు వ్యాపారంలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇందులో ప్రధాన పాత్రల్లో బిజు మీనన్ (ముత్తు), వినీత్ శ్రీనివాసన్ (కన్నన్), అపర్ణ బాలమురళి, గిరీష్ కులకర్ణి నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.