E-Paper
Advertisement

ఓటరు సవరణ చేస్తే పథకాలు కట్ అవుతాయా? క్లారిటీ ఇచ్చేసిన ఎన్నికల కమిషన్!

ఓటరు సవరణ చేస్తే పథకాలు కట్ అవుతాయా? క్లారిటీ ఇచ్చేసిన ఎన్నికల కమిషన్!
Advertisement

Voter Revision: తెలంగాణలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటరు జాబితా సవరణకు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ కేవలం తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు మాత్రమేనని అన్నారు. దీనితో ప్రభుత్వం పథకాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

మరోవైపు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించేందుకు 5 రోజులు గడువు మాత్రమే ఉన్నందున ఆగస్టు 3లోగా డిజిటలైజేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 76% డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం పూర్తైందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇందులో ఖానాపూర్, బాల్కొండ, ఎల్లారెడ్డి, హజూర్ నగర్, నర్సంపేట్, వర్ధన్నపేట్, పరకాల, బోద్ నియోజకవర్గాల్లో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని అన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులను ప్రశంసించారు.

Advertisement

అటు శేరిలింగంపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, జీహెచ్ఎంసీతో పాటు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల అధికారులు డిజిటలైజేషన్ మరింత ఫోకస్ పెట్టాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు పేర్లను తప్పులు లేకుండా అప్ లోడ్ చేసేలా బీఎల్ఓలు, సూపర్ వైజర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డిజిటలైజేషన్ లో నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.

Also Read: చౌక ధరలో చల్లని గాలి.. రూ.1000 లోపు బెస్ట్ నెక్ ఫ్యాన్లు.. హాయిగా రోడ్డుపై తిరగొచ్చు!

Advertisement

మరోవైపు ఒకే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఓటర్ల జాబితాను సిద్ధం చేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బీఎల్ఓల సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో జరిగే రాజకీయ పార్టీల సమావేశాలను వీడియోగ్రాఫ్ చేసి డాక్యుమెంట్ చేయాలన్నారు. దాంతో పాటు వీఐపీ, వీవీఐపీల ఓటర్లను గుర్తించి మ్యాపింగ్ చేయాలన్నారు.

Also Read: రూ. 5 వేలలోపు బెస్ట్ గ్రాఫిక్స్ టాబ్లెట్స్.. ఆర్టిస్టులు, స్టూడెంట్స్ ఫిదా అవ్వాల్సిందే!

Related News

ఇరిగేషన్ ఆఫీస్‌కు కోర్టు బిగ్ షాక్.. ప్రభుత్వ ఆఫీస్ జప్తుకు ఆదేశాలు జారీ!

SC/ST అట్రాసిటీ చట్టంపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ!

భూముల అంశాన్ని డైవర్ట్ చేసేందుకే నీళ్ల రాజకీయం: మంత్రి వాకిటి శ్రీహరి

KTR, హరీష్‌రావు పేర్లు ఫామ్‌హౌస్ రావు 1, 2గా మార్చుకోవాలి: బల్మూరు వెంకట్

నిధులు ఇస్తున్నా నిర్లక్ష్యమా? వరంగల్ ఆస్పత్రి పనులపై అధికారులకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

కాంగ్రెస్ సర్కార్‌కు BRS బిగ్ షాక్.. జూరాల నుంచి మొదలయ్యే ఆ బిగ్ ప్లాన్ ఏంటి?

హోటల్‌లో అనుమానాస్పదంగా యువతి మృతి.. విశాఖ నుంచి ప్రియుడితో కలిసి రాక, హైదరాబాద్ మాదాపూర్‌లో ఘటన

అరెస్టులకు భయపడేది లేదు.. అన్నదాతల తరఫున పోరాటం ఆపేది లేదు!- రామచందర్ రావు

Big Stories

Advertisement
×