E-Paper
Advertisement

భూముల అంశాన్ని డైవర్ట్ చేసేందుకే నీళ్ల రాజకీయం: మంత్రి వాకిటి శ్రీహరి

భూముల అంశాన్ని డైవర్ట్ చేసేందుకే నీళ్ల రాజకీయం: మంత్రి వాకిటి శ్రీహరి
Advertisement

Vakiti Srihari: కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) మీడియా హాల్ వేదికగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లా ప్రజలకు, రైతులకు కనీస ప్రయోజనం చేకూర్చని బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే జూరాల వద్ద హంగామా చేస్తోందని మండిపడ్డారు.

డైవర్షన్ రాజకీయం వెనుక అసలు నిజం

Advertisement

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారిన “దొరల భూముల” అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రతిపక్షాలు జూరాల వద్ద కావాలని రైతులను రెచ్చగొడుతున్నాయని మంత్రి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను నిండా ముంచిన నేతలు, ఇప్పుడు శవాల మీద పేలాలు ఏరుకునే రీతిలో నీళ్ల సమస్యను తెరపైకి తెచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీటి విడుదల యత్నాలు

Advertisement

రాష్ట్రంలో నెలకొన్న ‘ఎల్‌నినో’ ప్రభావం వల్ల వచ్చిన నీటి కొరతను రైతులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించామని శ్రీహరి తెలిపారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నీటిని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.

‘10 లక్షల జనాభా తాగునీటి అవసరాలు ముఖ్యం. రైతు ప్రయోజనాల కోసం అవసరమైతే కాళ్లు మొక్కడానికి కూడా వెనుకాడను. మేము నీళ్లు తెచ్చాక, ఆ శ్రేయస్సు తమదేనని చెప్పుకోవడానికి ప్రతిపక్షాలు ముందస్తు డ్రామాలు ఆడుతున్నాయి’ అని మంత్రి మండిపడ్డారు.

బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండండి

గతంలో బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు తాము బాధ్యతాయుత ప్రతిపక్షంగా నడుచుకున్నామని శ్రీహరి గుర్తుచేశారు. సమస్య తీవ్రతను రైతులకు నచ్చజెప్పామే తప్ప, కరవును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోలేదన్నారు. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 17.54 టీఎంసీలుగా ఉన్నందున, ప్రతిపక్షాలు కుటిల రాజకీయాలు విడనాడి ఎల్‌నినో పరిస్థితులపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని సూచించారు. పాలమూరు ప్రజలు, జూరాల ఆయకట్టు రైతులు ప్రతిపక్షాల మాటలను ఏమాత్రం నమ్మరని తేల్చి చెప్పారు.

Also Read: కానిస్టేబుళ్లకు బంపర్ ఆఫర్.. స్టైపెండ్ రూ.12,500కు పెంపు: హోంమంత్రి అనిత

Tags

Related News

దుండిగల్ మున్సిపాలిటీలో మహిళలకు దారుణం.. 12 పబ్లిక్ టాయిలెట్లకు తాళాలు!

ఇరిగేషన్ ఆఫీస్‌కు కోర్టు బిగ్ షాక్.. ప్రభుత్వ ఆఫీస్ జప్తుకు ఆదేశాలు జారీ!

SC/ST అట్రాసిటీ చట్టంపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ!

KTR, హరీష్‌రావు పేర్లు ఫామ్‌హౌస్ రావు 1, 2గా మార్చుకోవాలి: బల్మూరు వెంకట్

నిధులు ఇస్తున్నా నిర్లక్ష్యమా? వరంగల్ ఆస్పత్రి పనులపై అధికారులకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

కాంగ్రెస్ సర్కార్‌కు BRS బిగ్ షాక్.. జూరాల నుంచి మొదలయ్యే ఆ బిగ్ ప్లాన్ ఏంటి?

హోటల్‌లో అనుమానాస్పదంగా యువతి మృతి.. విశాఖ నుంచి ప్రియుడితో కలిసి రాక, హైదరాబాద్ మాదాపూర్‌లో ఘటన

Big Stories

Advertisement
×