E-Paper
Advertisement

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు!

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు!
Advertisement

APSRTC Bus: అన్నమయ్య జిల్లాలో ఉదయాన్నే ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైరు ఒక్కసారిగా పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

కల్వర్టులోకి దూసుకెళ్లిన నాన్‌స్టాప్‌ బస్సు

Advertisement

స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. మదనపల్లె ఆర్టీసీ డిపోకు చెందిన నాన్‌స్టాప్‌ బస్సు మంగళవారం ఉదయం ప్రయాణికులతో తిరుపతికి బయల్దేరింది. మదనపల్లె-తిరుపతి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, వాల్మీకిపురం మండలం విఠలం గ్రామం సమీపంలోకి రాగానే బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తాపడింది.

క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స

Advertisement

ప్రమాదం జరగగానే స్థానికులు వెంటనే స్పందించి బాధితులను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన 20 మంది ప్రయాణికులను వెంటనే 108 వాహనాల్లో వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం, వారిలో పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్న కొందరిని మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న ఎస్సై తిప్పేస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: భూముల అంశాన్ని డైవర్ట్ చేసేందుకే నీళ్ల రాజకీయం: మంత్రి వాకిటి శ్రీహరి

Tags

Related News

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు నేడే.. ఓట్ల లెక్కింపు షురూ.. కౌంటింగ్ కేంద్రాల్లో టెన్షన్ టెన్షన్!

చీరాలలో కాంగ్రెస్ సంచలనం.. కూటమికి వైఎస్ షర్మిలా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!

కౌంటింగ్ ముంగిట విషాదం.. జనసేన MPTC అభ్యర్థి మృతి!

పొమ్మనకుండా పొగబెట్టారు.. ఆత్మగౌరవం చంపుకోలేకే బయటకొచ్చా: విజయసాయిరెడ్డి

చెన్నైలో వైఎస్ ఫ్యామిలీ వివాహ వేడుక.. వేదికపై సీఎం విజయ్, జగన్, అదానీ.. ఇంతకీ కొత్త స్కెచ్ ఏంటి?

కర్నూలు జిల్లాలో జడ్పీటీసీ ఎన్నిక రద్దు.. మళ్లీ రీపోలింగ్?

మున్సిపల్ చైర్‌పర్సన్ సీటు కోసం లవర్‌ని పెళ్లిచేసుకున్న టీడీపీ నేత.. కానీ చివరికి..?

లక్షల రూపాయల ప్రజాధనం వృదా అయినట్టేనా.. పరకాల మార్కెట్ యార్డ్‌లో దారున సమస్య!

Big Stories

Advertisement
×