E-Paper
Advertisement

251 రూపాయలకే ఫోన్ పేరుతో దేశాన్ని మోసం చేసిన రియల్ స్కామ్… ఇప్పుడు తెలుగు సిరీస్‌గా ఓటీటీలోకి

251 రూపాయలకే ఫోన్ పేరుతో దేశాన్ని మోసం చేసిన రియల్ స్కామ్… ఇప్పుడు తెలుగు సిరీస్‌గా ఓటీటీలోకి
Advertisement

Investigative Thriller: 2016లో దేశమంతా ఓ షాకింగ్ వార్త సంచలనం సృష్టించింది. కేవలం 251 రూపాయలకే స్మార్ట్‌ఫోన్ ఇస్తామని ఒక కంపెనీ ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన 3G స్మార్ట్‌ఫోన్ అంటూ చేసిన ఆ ప్రకటనను నమ్మి లక్షలాది మంది బుకింగ్‌లు చేశారు. కానీ రోజులు గడిచినా ఫోన్ రాలేదు. చివరకు అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ కుంభకోణంగా మారింది. ఇప్పుడు అదే రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన తెలుగు వెబ్ సిరీస్ ‘Azadi 501’ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇంతకీ ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

దేశంలో స్మార్ట్‌ఫోన్‌లు ఇంకా అందరికీ అందుబాటులో లేని సమయంలో కథ నడుస్తుంది. ఒక కొత్త సంస్థ సంచలన ప్రకటన చేస్తుంది. కేవలం రూ. 251 చెల్లిస్తే అత్యాధునిక ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ అందిస్తామనేది ఆ ప్రకటన సారాంశం. ఇంత తక్కువ ధరకు ఫోన్ వస్తుందని ఎవ్వరూ ఊహించరు. అందుకే ఆ ప్రకటన క్షణాల్లో వైరల్ అవుతుంది. లక్షలాది మంది కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుకింగ్‌లు చేయడం ప్రారంభిస్తారు. ఒక్కరోజులోనే అంత భారీగా ట్రాఫిక్ రావడంతో వెబ్‌సైట్ కూడా క్రాష్ అవుతుంది. చాలామంది తమ బుకింగ్ సక్సెస్ అయ్యిందని భావించి, ఫోన్ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ ఆ ఫోన్ మాత్రం రాదు.

Advertisement

మొదట కంపెనీ ప్రతినిధులు ఆ ఆలస్యం గురించి చిన్న చిన్న సాకులు చెబుతారు. తర్వాత ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతోందని వివరణ ఇస్తారు. కానీ నెలలు గడిచినా వినియోగదారుల చేతికి ఒక్క ఫోన్ కూడా చేరదు. దీంతో అనుమానాలు మొదలవుతాయి. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. జర్నలిస్టులు, దర్యాప్తు అధికారులు కంపెనీ వెనుక ఉన్న నిజాలను వెలికితీయడం మొదలు పెడతారు. అసలు ఆ కంపెనీ నిజంగానే ఫోన్లు తయారు చేసిందా ? లేక మొదటి నుంచే ప్రజలను నమ్మించి డబ్బులు లాగడమే వాళ్ళ లక్ష్యమా ? అనే ప్రశ్నలు తెరపైకి వస్తాయి.

దర్యాప్తు సాగుతున్న కొద్దీ ఒక్కో కొత్త విషయం బయట పడుతుంది. కంపెనీ ఇచ్చిన హామీలు, ప్రచార వ్యూహాలు, పెట్టుబడిదారులను ఆకర్షించే పద్ధతులతో… ఆ కేటుగాళ్లు ప్రజల ఆశలను ఎలా తమకు అనుకూలంగా మార్చుకున్నారో చూపిస్తారు. సాధారణ ప్రకటనలా కనిపించిన ఆ యాడ్ వెనుక ఎంత పెద్ద ప్లాన్ దాగి ఉందో నెమ్మదిగా అర్థమవుతుంది. ఒక సంచలన ప్రకటన దేశవ్యాప్తంగా జనాల్లో ఎలా నమ్మకం కలిగించింది ? చివరకు ఆ వ్యవహారం ఎలా బట్టబయలైంది ? ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు ? కోట్లాది మంది నమ్మకాన్ని ఎలా సొమ్ము చేసుకున్నారు ? దర్యాప్తు అధికారులు నిజాన్ని ఎలా బయట పెట్టారు ? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

తెలుగులో ఉందా ?

Advertisement

తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘ఆజాదీ 251’. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘Freedom 251’ ఫోన్ కుంభకోణం నుంచి ప్రేరణ పొందిన ఈ సిరీస్ జూలై 29 నుంచి ETV Win ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది. పైగా ఇది తెలుగులోనే ఉంది. కాబట్టి వీకెండ్ చూసి ఎంజాయ్ చేయండి.

Read Also: దేశాన్ని దోచుకునే హవాలా కింగ్‌పిన్స్.. చివరికి ఎలా చిక్కారో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Tags

Related News

200 ఏళ్ల వెనక్కి వెళ్లే ప్రేమికులు… అడుగడుగునా డేంజరస్ ట్విస్టులు… టైమ్-ట్రావెల్ విజువల్ వండర్

చీకట్లో విరుచుకుపడ్డ వింత రాక్షసులు… 500 ఏళ్ల నాటి నిజం బట్టబయలు… అర్ధరాత్రి ఆ అడవిలో ఏం జరిగింది ?

మందు బాటిల్ వల్ల మొదలైన గొడవ… చివరికి క్రైమ్‌లో చిక్కుకున్న స్నేహితులు… ఫుల్ నవ్వులు

వైరస్ తో దేశాన్నే తుడిచిపెట్టే డేంజరస్ ప్లాన్… హై వోల్టేజ్ మైండ్ బ్లోయింగ్ మిషన్

అండర్‌వరల్డ్ దందాలతో ఆగమయ్యే సిటీ… గ్యాంగ్‌స్టర్ వార్ తో మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ల గ్లామర్ లైఫ్ వెనకున్న సీక్రెట్… సోషల్ మీడియా ఫాలోవర్స్ డోంట్ మిస్

పార్క్‌లో మొదలైన ప్రేమ… పెళ్లి తర్వాత ఊహించని మలుపులు.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

30 దాటినా పిల్లను ఇవ్వట్లేదు… ఈ బ్యాచిలర్ హంగామా చూస్తే నవ్వాగదు

Big Stories

Advertisement
×