E-Paper
Advertisement

KTR, హరీష్‌రావు పేర్లు ఫామ్‌హౌస్ రావు 1, 2గా మార్చుకోవాలి: బల్మూరు వెంకట్

KTR, హరీష్‌రావు పేర్లు ఫామ్‌హౌస్ రావు 1, 2గా మార్చుకోవాలి: బల్మూరు వెంకట్
Advertisement

Balmoor Venkat: సిఎల్పీ మీడియా హాల్‌ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ బిఆర్‌ఎస్ అగ్రనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్, హరీష్ రావులు తమ పేర్లను ఫామ్‌హౌస్ రావు 1, ఫామ్‌హౌస్ రావు 2గా మార్చుకోవాలని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

కల్వకుంట్ల కుటుంబంపై భూ ఆరోపణలు

Advertisement

కల్వకుంట్ల కుటుంబానికి 400 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయని, మాజీ మంత్రుల వద్ద కూడా వందల ఎకరాలు ఉన్నాయని వెంకట్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వీరి భూ దోపిడీ బండారాన్ని బయటపెట్టారని, ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను దోచుకున్నారని అన్నారు. 2009 నాటి అఫిడవిట్‌లో కేవలం ఒకటో రెండో ఎకరాలు చూపిన హరీష్ రావు, 2023 నాటికి వేల ఎకరాల ఆస్తులు ఎలా సంపాదించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రాజెక్టుల వివాదం

Advertisement

వెలికట్టలో మాజీ సైనికుడి అసైన్డ్ భూమిని హరీష్ రావు తన మామ పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని బల్మూరి ఆరోపించారు. రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ పరిధిలోని భూమిని తన ఫామ్‌హౌస్ కోసం తగ్గించుకున్నారన్నారు. పరిహారంలో రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. జన్వాడ ఫామ్‌హౌస్ కేటీఆర్‌ది కాకపోతే బిఆర్‌ఎస్ నాయకులు ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రశ్నించారు.

పైలట్ రోహిత్ రెడ్డి, జగదీష్ రెడ్డిపై విమర్శలు

దుబాయ్‌లో కేదార్ చనిపోయినప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారని, అజీజ్ నగర్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీలకు, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 2009లో ఏమీ లేని స్థాయి నుండి సూర్యాపేట నుంచి హంపీ వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టారని బల్మూరి తీవ్రంగా ధ్వజమెత్తారు.

Also Read: నిధులు ఇస్తున్నా నిర్లక్ష్యమా? వరంగల్ ఆస్పత్రి పనులపై అధికారులకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

Tags

Related News

SC/ST అట్రాసిటీ చట్టంపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ!

భూముల అంశాన్ని డైవర్ట్ చేసేందుకే నీళ్ల రాజకీయం: మంత్రి వాకిటి శ్రీహరి

నిధులు ఇస్తున్నా నిర్లక్ష్యమా? వరంగల్ ఆస్పత్రి పనులపై అధికారులకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

కాంగ్రెస్ సర్కార్‌కు BRS బిగ్ షాక్.. జూరాల నుంచి మొదలయ్యే ఆ బిగ్ ప్లాన్ ఏంటి?

హోటల్‌లో అనుమానాస్పదంగా యువతి మృతి.. విశాఖ నుంచి ప్రియుడితో కలిసి రాక, హైదరాబాద్ మాదాపూర్‌లో ఘటన

అరెస్టులకు భయపడేది లేదు.. అన్నదాతల తరఫున పోరాటం ఆపేది లేదు!- రామచందర్ రావు

తెలంగాణలో ఉద్యోగుల పోరుబాట.. సీఎస్ చర్చలు ఫెయిల్.. ఇక తేల్చుకోవడమే!

Big Stories

Advertisement
×