E-Paper
Advertisement

అరుదైన మొక్కకి పవన్ కళ్యాణ్ పేరు..అసలు స్టోరీ ఇదే!

అరుదైన మొక్కకి పవన్ కళ్యాణ్ పేరు..అసలు స్టోరీ ఇదే!
Advertisement

Pawan Kalyan: మనుషుల పేరు సాధారణంగా మనుషులకే పెడతారు.అది కామన్,కానీ ఒక మనిషి పేరు మొక్కలకి పెట్టడం మీరెక్కడైనా చూశారా..?ఇదిగో అలాంటి ఓ క్రేజీ ఇన్సిడెంట్ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.అవును..తిరుపతి దగ్గరలో దొరికిన ఒక అరుదైన మొక్కకి ఒక మనిషి పేరు పెట్టారు.అది కూడా ఎవరిదో కాదండోయ్ ..ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ,ఇంతకీ పవన్ పేరు మొక్కకి ఏంటని ఆశ్చర్యపోతున్నారా ?అసలు విషయం చూసేద్దాం రండి.

అసలు విషయంలోకి వెళ్తే

Advertisement

తిరుపతి జిల్లాలోని తూర్పు కనుమల్లో ఉన్న ఉబ్బలమడుగు జలపాతం దగ్గర కంబకం కొండల ప్రాంతంలో కొందరు శాస్త్రవేత్తలు పరిశోదనలు చేస్తున్నారు.సరిగ్గా అదే సమయంలో వాళ్లకి ఒక అరుదైన మొక్క కనిపించింది,అది యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన కొత్త క్రోటన్ జాతి మొక్క.ఇక ఈ మొక్క దొరికిన ఈ ప్రాంతం అందరికి గుర్తు ఉండేలా దీనికి “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” అనే శాస్త్రీయ పేరు కూడా పెటారు.అయితే అంతటి తో ఆగకుండా దొరికిన ఆ మొక్కకి పవన్ కళ్యాణ్ పేరు పెట్టారు ఆ శాస్త్రవేత్తలు.కారణం చెట్లు, పర్యావరణం, పరిరక్షణ వంటి వాటిపై పవన్ కళ్యాణ్ అనేక సార్లు మాట్లాడటమే.అవును ,,ఇప్పటికే ఎన్నో సార్లు అడవులని,వాటి నుండి వచ్చే సంపదని కాపాడాలని పిలుపునివ్వడం మనం చూశాం కూడా.

ప్రత్యేకత ఏంటంటే 

Advertisement

ఇక దొరికిన ఈ అరుదైన మొక్క విషయానికి వస్తే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం దాని ఆకులే.అవును ..అన్ని ఆకుల్లా కాకుండా ఈ మొక్క యొక్క ఆకులని చేత్తో తాకినా, లేక దీనికి గాలి తాకినా చాలు.. దీని నుండి మంచి సువాసన వస్తుందట.అడవి మధ్యలో సహజంగా పరిమళాలు వెదజల్లే ఇలాంటి మొక్కలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయని  చెబుతున్నారు శాస్త్రవేత్తలు.అందుకే దీనిపై ఇప్పుడు మరిన్ని పరిశోధనలు కూడా మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే  ఈ జాతికి చెందిన మొక్కలు ఇప్పుడు తక్కువైపోయానని, ఇంకొన్ని రోజులైతే అంతరించిపోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు అక్కడి అధికారులు.క్రమ క్రమంగా . అడవులు తగ్గిపోవడం, వాతావరణంలో వస్తున్న మార్పులు, మానవ జోక్యం పెరగడం వల్ల ఇలాంటి అరుదైన మొక్కలు క్రమంగా మాయం అయిపోతున్నాయని అందుకే వీటిని ప్రత్యేకంగా కాపాడాల్సిన అవసరం ఉందని  సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.

ఇక ఉబ్బలమడుగు జలపాతం విషయానికి వస్తే ఇక్కడికి ఎక్కువగా ట్రెక్కింగ్‌కు, నేచర్ లవర్స్ వస్తుంటారు.ఇప్పుడు అక్కడే ఈ కొత్త మొక్క బయటపడటంతో ఆ ప్రాంతానికి మరింత మంది టూరిస్టులు వచ్చే అవకాశం ఎక్కువ.

మరో రికార్డు పవన్ సొంతం 

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భుజానికి సర్జరీ చేయించుకున్న సంగతి తెల్సిందే.ఇక అటు పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా  ఉన్నప్పటికీ ఇటు OG సినిమాకి సీక్వెల్ చేస్తానని ఇప్పటికే  అనౌన్స్ చేయడం తో మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్.ఏది ఏమైనా ఇప్పటి వరకు ఎన్నో రికార్డులని తన ఖాతాలో వేసుకున్న పవన్ ఈ సారి ఒక మొక్కకి తన పేరుని పెట్టడంతో మరో రికార్డుని సొంతం చేసుకున్నాడనే చెప్పాలి !

also read :అనసూయపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. ఛీ అవేం మాటలు?

Related News

సైమాలో ‘మిరాయ్’ మోత.. 11 నామినేషన్స్‌తో రికార్డ్!

రణ్‌బీర్‌కు క్లాస్ తీసుకున్న మహాభారత్ శ్రీకృష్ణుడు.. కారణం ఇదే!

6 వేల పాటలు పాడిన గాయని.. కె. జమునారాణి కన్నుమూత

ఎట్టకేలకు కొట్టేశాడు.. అఖిల్ కెరీర్‌లో తొలి 100 కోట్ల సినిమా..!

జగపతిబాబు మొహానికి సర్జరీ..? అసలు ఏమైంది..!

నడుమొంపులతో యువతలో గిలిగింతలు పెడుతున్న మానస వారణాసి!

నన్నూ కమిట్మెంట్ అడిగారు.. టాలీవుడ్ కంటే అక్కడే ఎక్కువ..రహస్యాలు బయటపెట్టిన ఆమని!

“మై బ్రదర్” అంటూ దుల్కర్‌పై ప్రేమ కురిపించిన ఎన్టీఆర్..!

Big Stories

Advertisement
×