Irrigation Dispute: మహబూబాబాద్ జిల్లా నీటిపారుదల శాఖ కార్యాలయంకు సిటి సివిల్ కోర్టు హైదరాబాద్ షాక్ ఇచ్చింది. 1983 సంవత్సరంలో అప్పటి కన్స్ట్రక్షన్ సర్కిల్ వరంగల్ పరిధిలో వెంకటేశ్వర్లు అనే కాంట్రాక్టర్ కు శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోని కాకతీయ కాలువ నెం 235 నుండి 236 వరకు తవ్వకం మరియు కాలువ గట్టు పనులు అప్పగించారు. కాంట్రాక్టు పని విలువ రూ1.397 కోట్లు అని తెలిపింది. ప్రభుత్వం చూపిన స్థలంలో హుజరాబాద్ ఇరిగేషన్ డివిజన్ పరిధిలోని వరంగల్ సర్కిల్లో ఒప్పందం ప్రకారం తవ్వకం మరియు కాలువ గట్టు పనులు చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ దే అని తెలిపింది.
అగ్రిమెంట్ ప్రకారం ప్రభుత్వంకు చెల్లించాల్సిన EMDనీ కాంట్రాక్టర్ చెల్లించాడని, కానీ ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు స్థలం చూపలేదని తెలిపింది. దీనితో ప్రభుత్వం తప్పిదం వల్ల పనులు ఆలస్యం కావడంతో పాటు రూ.67 లక్షలు నష్టం వాటిల్లిందని 1985 సంవత్సరంలో బాధిత కాంట్రాక్టు సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్‌ను ఆశ్రయించాడు. సుమారు 41 సంవత్సరాలుగా కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నాడు. సంవత్సరంకు 12 శాతం వడ్డీతో సహా 8కోట్ల70 లక్షల 55 వేలు ఇవ్వాలని పలుమార్లు ఇరిగేషన్ అధికారులకు నోటిసులు పంపాడు.
2021లో ఇరిగేషన్ శాఖలో జరిగిన మార్పులు వల్ల వరంగల్ SE కార్యాలయం నాలుగు SE కార్యాలయాలుగా విభజించారు. ఇలా హూజరాబాద్ డివిజన్ వరంగల్లో కలిసింది. కానీ అప్పుడు అగ్రిమెంట్ చేసిన అధికారులు జిల్లా ఇరిగేషన్ శాఖలో పని చేస్తున్నారు. కోర్టు తీర్పు జప్తు చేయాలని ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు కోర్టు ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ కార్యాలయంలోని సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Also read: సంచలనం సృష్టిస్తున్న ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ డీల్స్.. ఐఫోన్ 17తో పాటు ఆ ఐటమ్స్‌పై భారీ ఆఫర్లు!