E-Paper
Advertisement

బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు.. Moto Buds 2 Fusion ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు.. Moto Buds 2 Fusion ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!
Advertisement

Moto Buds 2 Fusion: తక్కువ బడ్జెట్‌లో మంచి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనాలనుకునేవాళ్లకు మోటరోలా గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తాజాగా కొత్త బడ్జెట్ ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ.2,000 లోపే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, భారీ బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఇందులో అందిస్తోంది. మరి ఈ ఇయర్‌బడ్స్‌లో ఉన్న ఫీచర్లు, ధర, లభ్యత ఏంటో చూద్దామా..

కలర్ ఆప్షన్స్ ఇవే:

ఈ Moto Buds 2 Fusion ధరను కంపెనీ రూ.1,999గా నిర్ణయించింది. వీటిని ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటరోలా అధికారిక స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. ట్యాప్ షూ, లారెల్, సర్ఫ్ ది వెబ్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read: రోజూ 2GB డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ ఫ్రీ.. Jio కొత్త రీఛార్జ్ ప్లాన్ చూశారా?

ఏకంగా ఆరు మైకులు:

ఈ ఇయర్‌బడ్స్‌లో 55dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) అందించారు. దీంతో బయట ఉండే శబ్దాలను తగ్గించుకుని మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. ఆడియో కోసం 12.4mm టైటానియం కోటెడ్ డ్రైవర్లను ఉపయోగించారు. కాల్స్ మరింత క్లియర్‌గా ఉండేందుకు ఆరు మైకులు, క్రిస్టల్‌టాక్ AI టెక్నాలజీ కూడా ఉన్నాయి.

53 గంటల బ్యాటరీ బ్యాకప్:

Advertisement

Moto Buds 2 Fusion బ్యాటరీ విషయంలోనూ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ 13 గంటల వరకు పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 53 గంటల బ్యాకప్ లభిస్తుంది. 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో మూడు గంటల వరకు ప్లేబ్యాక్ పొందవచ్చు.

కొత్తగా గేమింగ్ ఫీచర్లు:

బ్లూటూత్ 6.0, డ్యూయల్-డివైస్ కనెక్టివిటీ, తక్కువ లేటెన్సీ గేమింగ్ మోడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్ ఇచ్చారు. మొత్తంగా రూ.1,999 ధరలో మంచి ఫీచర్లు కోరుకునేవారికి ఈ మోటరోలా ఇయర్‌బడ్స్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాయి.

Also Read: అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేస్తోన్న Samsung Galaxy Tab S12.. లాంచ్ డేట్ లీక్!

Tags

Related News

తెలివైన వాళ్ళు మాత్రమే..వాడే ఈ సేఫ్టీ మోడ్ గురించి మీకు తెలుసా?

కొత్త ఫోన్ కొనేటప్పుడు ర్యామ్,ప్రాసెసర్,కెమెరా లేదా ఏది ముఖ్యం?

ఇంటిని డిస్కో థియేటర్‌లా మార్చేయండి! టాప్ 5 హై-పెర్ఫార్మెన్స్ ఎల్జీ సౌండ్‌బార్స్!

అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేస్తోన్న Samsung Galaxy Tab S12.. లాంచ్ డేట్ లీక్!

ల్యాప్‌టాప్‌లపై 40% డిస్కౌంట్..స్టూడెంట్స్ అస్సలు మిస్ కావద్దు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026..ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బు వేస్టే!

కీబోర్డ్‌లో ‘స్పేస్ బార్’ అంత పెద్దగా ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే!

Big Stories

Advertisement
×