E-Paper
Advertisement

కొత్త ఫోన్ కొనేటప్పుడు ర్యామ్,ప్రాసెసర్,కెమెరా లేదా ఏది ముఖ్యం?

కొత్త ఫోన్ కొనేటప్పుడు ర్యామ్,ప్రాసెసర్,కెమెరా లేదా ఏది ముఖ్యం?
Advertisement

Smartphone Buying Guide 2026: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ కేవలం కాల్స్ మాట్లాడే సాధనం మాత్రమే కాదు, మన జీవితంలో భాగమైపోయింది. మార్కెట్లో కొత్త స్మార్ట్‌ ఫోన్ కొందామని షాపు కెళ్లినా లేదా ఆన్‌ లైన్‌లో వెతికినా విపరీతమైన ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎక్కువ ర్యామ్, కోట్లాది మెగా పిక్సెల్స్ కెమెరా, పవర్‌ ఫుల్ ప్రాసెసర్, సరి కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఫోన్ రేట్లను డిసైడ్ చేస్తున్నాయి. అయితే.. సామాన్య కస్టమర్‌కు వీటిలో ఏది నిజంగా ముఖ్యం? రూ.20,000 బడ్జెట్ నుంచి లక్ష రూపాయల ప్రీమియం ఫోన్ వరకు ఏ ఫీచర్‌కు ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? మీ డబ్బుకు తగిన స్మార్ట్‌ ఫోన్‌ను ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ప్రాసెసర్ (Processor / Chipset):

మీ ఫోన్ ఎంత వేగంగా పని చేస్తుంది, హ్యాంగ్ కాకుండా ఎంత స్మూత్‌గా రన్ అవుతుంది అనేది పూర్తిగా ప్రాసెసర్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు.. హెవీ గేమింగ్ ఆడినా, ఒకే సారి ఐదారు యాప్స్ వాడినా ప్రాసెసర్ (ఉదాహరణకు: స్నాప్‌డ్రాగన్ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ చిప్స్) కీలక పాత్ర పోషిస్తుంది. గేమర్స్, హై-ఎండ్ యూజర్స్, ఫోన్ ఐదారు సంవత్సరాలు ఎలాంటి లాగ్ లేకుండా రావాలనుకునే వారికి ప్రాసెసరే అత్యంత ముఖ్యం.

Advertisement

ధరలు:రూ.15,000 నుంచి రూ.30,000 లోపు మంచి 5G ప్రాసెసర్లు లభిస్తుండగా.. ఫ్లాగ్‌ షిప్ ప్రాసెసర్లు ఉన్న ఫోన్ల ధర రూ.50,000 నుంచి రూ.1,00,000 పైమాటే ఉంటుంది.

2. ఏఐ (Artificial Intelligence / NPU):

ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతున్న ఏకైక అంశం ఏఐ. రియల్ టైమ్ కాల్ ట్రాన్స్‌లేషన్, వాయిస్ నోట్స్ సమ్మరైజేషన్, ఫోటోలలో ఆబ్జెక్ట్‌లను తొలగించడం వంటి పనులన్నీ ఫోన్‌లోని NPU చూసుకుంటుంది.  ఆఫీస్ వర్క్ చేసేవారు, కంటెంట్ క్రియేటర్లు, ఎప్పుడూ లేటెస్ట్ టెక్నాలజీని వాడాలనుకునే వారికి ఏఐ సపోర్ట్ ఉన్న ఫోన్లు చాలా అవసరం. ప్రస్తుతం గూగుల్ పిక్సెల్, శామ్‌సంగ్ ఎస్ సిరీస్ , ఐఫోన్లలో ఏఐ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

3. కెమెరా (Camera & Sensor Size):

Advertisement

చాలా మంది 108MP లేదా 200MP అని చూడగానే కెమెరా అదిరిపోతుందని భ్రమపడతారు. కానీ ఫోటో క్వాలిటీ అనేది మెగాపిక్సెల్స్ మీద కాకుండా కెమెరా సెన్సార్ సైజు , కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ మీద ఆధారపడి ఉంటుంది. రీల్స్ చేసేవారు, యూట్యూబర్స్ , ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్నవారికి మంచి అపర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న కెమెరా ముఖ్యం.

ధరలు: రూ. 25,000 బడ్జెట్‌లోనే అద్భుతమైన కెమెరా ఫోన్లు లభిస్తున్నాయి. ప్రీమియం కెమెరా ఫోన్ల ధరలు రూ.70,000 నుంచి ప్రారంభమవుతాయి.

4. ర్యామ్ ,స్టోరేజ్ (RAM & Storage):

ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్ లో ఎన్ని యాప్స్ ఓపెన్ చేసి ఉంచినా ఫోన్ రీఫ్రెష్ కాకుండా.. ఉండటానికి RAM సహాయ పడుతుంది. ప్రస్తుత రోజుల్లో కనీసం 8GB లేదా 12GB RAM ఉన్న ఫోన్‌లను ఎంచుకోవడం బెస్ట్. అలాగే ఫాస్ట్ రీడింగ్ కోసం UFS 4.0 లేదా అంతకంటే మెరుగైన స్టోరేజ్ టైప్ ఉన్నాయో లేదో చూసుకోవాలి.

ఏది కొనాలి?
మీ అవసరాన్ని బట్టి ఫోన్‌ను ఎంచుకోండి. మీరు నిత్యం ఫోటోలు, వీడియోలు తీసుకునేవారైతే కెమెరా, ఏఐకి ప్రాధాన్యత ఇవ్వండి. అదనంగా, కనీసం 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్‌ను కొనడం ద్వారా లాంగ్ లాస్టింగ్ బ్యాకప్‌ను పొందవచ్చు. మీ బడ్జెట్‌కు తగిన పర్‌ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్‌ను సెలెక్ట్ చేసుకొని స్మార్ట్‌గా షాపింగ్ చేయండి!

Related News

తెలివైన వాళ్ళు మాత్రమే..వాడే ఈ సేఫ్టీ మోడ్ గురించి మీకు తెలుసా?

బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు.. Moto Buds 2 Fusion ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

ఇంటిని డిస్కో థియేటర్‌లా మార్చేయండి! టాప్ 5 హై-పెర్ఫార్మెన్స్ ఎల్జీ సౌండ్‌బార్స్!

అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేస్తోన్న Samsung Galaxy Tab S12.. లాంచ్ డేట్ లీక్!

ల్యాప్‌టాప్‌లపై 40% డిస్కౌంట్..స్టూడెంట్స్ అస్సలు మిస్ కావద్దు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026..ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బు వేస్టే!

కీబోర్డ్‌లో ‘స్పేస్ బార్’ అంత పెద్దగా ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే!

Big Stories

Advertisement
×