E-Paper
Advertisement

ఉక్రెయిన్ యుద్ధంలో జగిత్యాల వాసి మృతి.. కుటుంబాన్ని ఆదుకున్న సీఎం రేవంత్!

ఉక్రెయిన్ యుద్ధంలో జగిత్యాల వాసి మృతి.. కుటుంబాన్ని ఆదుకున్న సీఎం రేవంత్!
Advertisement

Sudharshan Goud: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్ గౌడ్ క్షిపణులు, డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలిపారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ఆర్థిక సహాయం..

సుదర్శన్ గౌడ్ భార్య విజ్ఞప్తి మేరకు ఈ ఘటనను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి ఈ ఆర్థిక సహాయం అందించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సుదర్శన్ గౌడ్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Advertisement

Also read: సీఎం రేవంత్ వ్యూహానికి తట్టుకోలేకపోతున్నారా.. సిరిసిల్ల, సిద్దిపేటలో మారుతున్న పొలిటికల్ సీన్?

Tags

Related News

ఫార్ములా-ఈ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్!

మహిళలకు కవిత బంపరాఫర్.. అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్లకు హామీ!

దేశ రాజధానిలో హైటెన్షన్.. సుప్రీంకోర్టుకు ర్యాలీగా సీఎం రేవంత్ రెడ్డి!

వంట చేస్తుండగా పేలిపోయిన గ్యాస్ సిలిండర్.. స్పాట్‌లో యువకుడు..?

మీ మొబైల్లో వాట్సాప్‌కి YES or NO అని మెసేజ్ వస్తుందా.. అయితే బీ కేర్ ఫుల్..?

ఉప్పల్‌లో ఇండియా vs వెస్టిండీస్ మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు.. పోలీసుల గైడ్‌లైన్స్ ఇవే!

రైతులు ఇబ్బంది పడుతుంటే మంత్రులు గోవా, ఢిల్లీ ట్రిప్పులా?: హరీశ్‌రావు

Big Stories

Advertisement
×