Aloo Pacchii Karam: మన వంటకాల్లో బంగాళదుంపకు ఉన్న స్థానమే వేరు. ఏ కూరలో వేసినా దాని రుచిని పెంచే సత్తా ఆలూకి ఉంది. అయితే ఎప్పుడూ చేసే సాదాసీదా ఆలూ ఫ్రై కాకుండా, పచ్చిమిర్చి, అల్లం మరియు వెల్లుల్లితో దంచిన పచ్చి కారాన్ని ఉపయోగించి చేసే ‘ఆలూ పచ్చి కారం’ కూర టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ ఆలూ పచ్చి కారం కలుపుకుని తింటే ఆ మజ్జాయే వేరు. లంచ్ బాక్సులకి కూడా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ రెసిపీని చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
బంగాళదుంపలు: 3 లేదా 4 (ఉడికించి, ముక్కలుగా తరిగినవి లేదా పచ్చి ముక్కలు)
పచ్చిమిర్చి: 6 నుంచి 8 (కారం తగినట్లు)
వెల్లుల్లి రెమ్మలు: 6-7
అల్లం: చిన్న ముక్క
జీలకర్ర: 1 స్పూన్
పసుపు: అర స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 3 టేబుల్ స్పూన్లు
కరివేపాకు, కొత్తిమీర: గుప్పెడు
1. ముందుగా మిక్సీ జార్‌లో లేదా రోట్లో పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా (మరీ మెత్తగా కాకుండా) గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చి కారం మంచి సువాసనను ఇస్తుంది. అంతే కాకుండా కూరకి అసలైన రుచిని తెస్తుంది.
2. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలానివ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగిన బంగాళదుంప ముక్కలను వేసి మీడియం మంటపై దోరగా వేయించాలి. బంగాళదుంపలు కొద్దిగా మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి.
Also Read: పక్కా తెలంగాణ స్టైల్ సర్వపిండి..ఒక్క సారి టేస్ట్ చేస్తే అస్సలు వదలరు!
3.బంగాళదుంపలు ముక్కలు సగం ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చి మిర్చి-వెల్లుల్లి పచ్చి కారాన్ని అందులో వేయాలి. అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. పచ్చి కారం యొక్క పచ్చి వాసన పోయి, నూనె పైకి తేలే వరకు మంటను లో-ఫ్లేమ్‌లో ఉంచి బాగా ఫ్రై చేయాలి.
4. ఆలూ ముక్కలకు పచ్చి కారం పూర్తిగా పట్టి మంచి కలర్ వస్తుంది.చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. గుమగుమలాడే ఘాటైన ఆలూ పచ్చి కారం రెడీ!
తక్కువ సమయంలో.. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే నోటికి రుచిగా ఉండేలా ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ ఆలూ పచ్చి కారం బెస్ట్. మీ ఇంట్లో వాళ్లందరికీ ఈ రెసిపీ కచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడే ట్రై చేయండి!