E-Paper
Advertisement

CM Revanth Reddy Delhi Tour : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. అజెండా ఇదేనా..?

CM Revanth Reddy Delhi Tour : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. అజెండా ఇదేనా..?
Advertisement

CM Revanth Reddy Delhi Tour: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి బయలుదేరారు. ప్రత్యేక విమానంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు హస్తినకు వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. అలాగే నామినేటెడ్ పదవులు, పార్టీలో చేరికలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ లోక్ సభ టిక్కెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆశావహుల నుంచి భారీ స్పందన లభించింది. ప్రతి నియోజకవర్గానికి భారీగా పోటీ నెలకొంది. ప్రతి చోట టిక్కెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది.

Advertisement

మరోవైపు పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలా మంది బలమైన నేతలు వచ్చారు. వారంతా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న యోచనలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ల కోసం పోటీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

Read More: గృహజ్యోతి పథకం వీరికే.. ముహూర్తం ఫిక్స్.. ఈ షరతులు వర్తిస్తాయ్..

Advertisement

ఎంపీ అభ్యర్థులపై ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో ఎంపీ అభ్యర్థులపై కొంత వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పదవుల కోసం కూడా పోటీ పెరిగింది. ఎమ్మెల్యే టిక్కెట్ దక్కని కొందరు కీలక నేతలు ఇప్పుడు ఎంపీ టిక్కెట్ రేసులో ఉన్నారు. చాలాకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నా ఎమ్మెల్యే టిక్కెట్ దక్కిని నేతలు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. ఈ అంశాలపైనా ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారని తెలుస్తోంది.

Tags

Related News

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Big Stories

Advertisement
×