BigTV English

నగరంలో కలకలం.. ప్రాణం తీసిన పంటి వైద్యం!

నగరంలో కలకలం.. ప్రాణం తీసిన పంటి వైద్యం!

Man Allegedly Dies Due to Teeth Procedure: జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.37లో ఎఫ్‌ఎంఎస్‌ ఇంటర్నేషనల్‌ డెంటల్‌ క్లినిక్‌ (FMS International Dental Clinic)లో 28 ఏళ్ల వ్యక్తి దంత చికిత్స పొందుతూ మృతి చెందాడు.


బాధితుడిని లక్ష్మీనారాయణ వింజం గా గుర్తించారు. దంత వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబీకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కువ మోతాదులో అనస్థీషియా ఇవ్వడమే ఆయన అకాల మరణానికి కారణమైందని ఆరోపించారు.

లక్ష్మి నారాయణ అనే వ్యాపారవేత్త స్మైల్-డిజైనింగ్ (Smile-Designing) అనే ప్రక్రియ కోసం ఈ క్లినిక్‌ని సంప్రదించాడు. చికిత్స సమయంలో అతనికి అనస్థీషియా ఇవ్వబడింది. ఆ తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. బాధితుడిని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాధితుడిని పరిశీలించగా.. మరణించినట్లు తెలిపారు.


Read More: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు..

తన కుమారుడి మృతికి దంతవైద్యుడే కారణమంటూ బాధితుడి తండ్రి వింజం రాములు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎక్కువ మోతాదులో అనస్థీషియా ఇవ్వడంలో దంతవైద్యుడి నిర్లక్ష్యం వల్లే తన కొడుకు ప్రాణాలు కోల్పోయాడని ఫిర్యాదులో తెలిపాడు. సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవాలని రాములు పోలీసులను కోరారు.

పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (ICC)లోని సెక్షన్ 304 (A) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×