BigTV English
Advertisement

CM Revanth Reddy Speech: నిజాంకు నకలు కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చాం!

CM Revanth Reddy Speech: నిజాంకు నకలు కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చాం!

CM Revanth Reddy news today


CM Revanth Reddy Speech in Media Program: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలనపై హైదరాబాద్ లో మీట్ ది మీడియా నిర్వహిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టిన చర్యలను వివరిస్తున్నారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన 48 గంటల్లోపే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. ఆ తర్వాత ఒక్కో గ్యారంటీ అమలు చేస్తున్నామన్నారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీయం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని పెంచామని చెప్పారు.


తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ రాచరిక పోకడలు అనుసరించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు తనకు కట్టు బానిసలుగా ఉండాలని చూశారని.. ఆనాడు నిజాం నేడు కేసీఆర్ ఆచరణ శైలి ఒక్కటేనని ఆరోపించారు. ఆధిపత్యం చెలాయించే వాడు ముందు సంస్కృతిపై దాడి చేస్తాడని తెలిపారు. కేసీఆర్ అదే పని చేశారని విమర్శించారు. కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు వాసన వెదజల్లుతూనే ఉన్నాయని తెలిపారు. ఆ గంజాయి మొక్కలను పీకే పనిలో ఉన్నానని స్పష్టంచేశారు. ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన హరీశ్ రావు పన్నీరు కాదని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.

Also Read: 37 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. పార్టీ కోసం కష్టపడిన నేతలకు అవకాశం..

1948 సెప్టెంబర్ 17కు ఎంతో ప్రాముఖ్యత ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే 2023 డిసెంబర్ 3 కు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని స్పష్టం చేశారు. నాడు నిజాం రాచరిక పాలన అంతమైతే నేడు కేసీఆర్ పాలన పోయిందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలో వెహికిల్స్ రిజిస్ట్రేషన్ లో టీజీ బదులు టీఎస్ తీసుకొచ్చారని ఎందుకంటే అప్పటి టీఆర్ఎస్ పేరుకు సారూప్యంగా ఉండటంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించలేదన్నారు.తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని వ్యతిరేకించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ధర్నా చౌక్ వద్దన్న వారినే అక్కడే నిరసన చేసుకునేందుకు అనుమతి ఇచ్చామని గుర్తుచేశారు. ప్రగతి భవన్ పేరు ప్రజా భవన్ గా మార్చి ప్రజలకు దగ్గరయ్యామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛను ఇస్తున్నామన్నారు.

తెలంగాణను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టారని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల ముందు పెట్టామన్నారు.

Tags

Related News

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారంలో కనిపించని కేసీఆర్, కేడర్‌లో అనుమానాలు, నెక్ట్స్ ఏంటి?

KTR: బీఆర్ఎస్ కొత్త ప్లాన్.. ‘కారు’తో సీఎం చంద్రబాబు.. కేటీఆర్ కామెంట్స్ వెనుక

Maganti Gopinath Mother: నా కొడుకును చంపింది వాళ్లే.. పోలీస్ స్టేషన్‌కు మాగంటి గోపీనాథ్ తల్లి

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Big Stories

×