BigTV English

CM Revanth Reddy Comments: ఆట మొదలైంది.. కాంగ్రెస్‌లో చేరిన దానం, రంజిత్ రెడ్డి!

CM Revanth Reddy Comments: ఆట మొదలైంది.. కాంగ్రెస్‌లో చేరిన దానం, రంజిత్ రెడ్డి!

cm revanth reddyMP Ranjith Reddy, Danam Nagendar Joins Congress: పార్లమెంట్ ఎన్నికలకు ముందు మాజీ సీఎం కేసీఆర్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. గులాబీ దళంకి గుడ్ బై చెప్పిన ఈయన సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈయనతో పాటుగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు.


వీరు పార్టీలో చేరిన నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. “కోడ్ రానంతవరకు సీఎంగానే వ్యవహరించా. ఇవాళే పార్టీ అధ్యక్షుడిగా యాక్షన్ మొదలుపెట్టా. చిన్న తప్పిదాన్ని కూడా జరగనివ్వలేదు. ప్రజాస్వామ్యాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటామా?.. కాంగ్రెస్ లో చేరికలకు గేట్లు ఎత్తేశాం. ఈరోజు ఉదయం ఒక గేటు మాత్రమే తెరిచాం. కాంగ్రెస్ లో గేట్లు ఎత్తువేశాం.. పార్టీలో చేరాలనుకున్న వారు చేరవచ్చు. 14 ఎంపీ సీట్లు ఎలా గెలవాలో మా వ్యూహాలు మాకు ఉన్నాయి. కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు” అని అన్నారు.

ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను బీజేపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఇచ్చినందుకు KCR, KTRకు రంజిత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నా రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇతకాలం తనకి బీజేపీలో తోడు ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


Also Read: CM Revanth Reddy Speech : నిజాంకు నకలు కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చాం..

ఇటీవలే కేసీఆర్ తో సమావేశమైన ఈయన తాను పార్లమెంట్ సీటు ఆశించడంలేదని తెలిపారు. తన స్థానంలో ఎవరిని అభ్యర్థిగా నియమించినా సరే తాను సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇంతలోనే ఆయన కేసీఆర్ కు ఊహించని షాక్ ఇస్తూ పార్టీకి రాజీమానా చేశారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి బీఆర్ఎస్ కు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లానుంచి ముగ్గురు జెడ్పీ చైర్మన్లు కాంగ్రెస్ లో చేరారు. ఇటవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈరోజు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×