BigTV English

Deepadasmunishi Meets MP Kesavarao: కేకేతో మున్షీ సమావేశం.. అందుకేనా..?

Deepadasmunishi Meets MP Kesavarao: కేకేతో మున్షీ సమావేశం.. అందుకేనా..?


Deepadasmunishi Meets MP Kesavarao: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు నేతలు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. ఇవాళ సొంత పార్టీలో ఉంటున్నారు. రేపు మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కొద్దిరోజులుగా తెలంగాణలో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఎన్నికల వేళ నేపథ్యంలో వలస బాట పడుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ కండువాలు కప్పుకుంటున్నారు.

తాజాగా మరో బ్రేకింగ్ న్యూస్. శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కేశవరావు ఇంటికి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ వెళ్లారు. దాదాపు గంటలకు పైగానే చర్చలు జరిగినట్టు ఇన్ సైడ్ సమాచారం. ఈ క్రమంలో కేకేతోపాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని మున్షీ పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం.


గతంలో కేశవరావు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చాలామంది ఢిల్లీ నేతలతో పరిచయాలున్నాయి. ఈ క్రమంలో ఆయన దగ్గరకు దీపాదాస్ మున్షీ వెళ్లినట్టు చెబుతున్నారు. అంతేగానీ రకరకాలుగా ఊహించుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మున్షీ వెళ్లడం అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. కొద్దిరోజుల కిందట మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అప్పుడు కూడా ఆమె పార్టీ మారుతున్నట్లు వార్తలొచ్చాయి. తర్వాత వాటిని ఆమె ఖండించారు ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

Also Read: Praneet Rao Case: SIB ప్రణీత్ రావు కేసు.. మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో సోదాలు

సుదీర్ఘంకాలం కాంగ్రెస్ లో ఉన్నారు ఎంపీ కేశవరావు. 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పట్లో కేసీఆర్ కు సలహాలు ఇచ్చేవారిలో ఈయన కూడా ఒకరు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత.. మేయర్ పదవి తన కూతురికి దక్కేలా పావులు కదిపారు కేకే. మేయర్ కుర్చీకి చాలామంది నేతలు అప్పట్లో పోటీపడ్డారు. అనూహ్యంగా తెరపైకి విజయలక్ష్మి పేరు వెలుగులోకి వచ్చింది. దీనిబట్టి కేసీఆర్ తో కేకే ఉన్న సంబంధాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Tags

Related News

Kingfisher Beer: కింగ్ ఫిషర్ బీరులో సర్ప్రైజ్.. వరంగల్‌లో షాకింగ్ ఘటన!

HC Banned Beef: కావాలంటే ముందు రోజు కొనుక్కో.. బీఫ్ లవర్స్‌కు హైకోర్టు మొట్టికాయలు

TG Heavy Rains: తెలంగాణ ఐదు రోజులు భారీ వర్షాలు.. బయటకు వెళ్లొద్దు

Hyderabad building: బేగంబజార్‌లో కూలిన పాత భవనం.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Peddamma Temple: పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు..

Musi River: మూసీ వరదలో చిక్కుకున్న యువకుడు.. రెస్క్యూ టీమ్ వచ్చే లోపే..

Big Stories

×