Big Stories

Anna Hazare on Kejriwal’s Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అన్నా హజారే రియాక్షన్.. షాకింగ్ కామెంట్స్!

Anna Hazare on Kejriwal's arrest
Anna Hazare on Kejriwal’s arrest

Anna Hazare on Kejriwal’s Arrest: గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసులో దాదాపు వందల ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు ముఖ్య పాత్ర పోషించిన రాజకీయ నేతలను కటకటాలకు పంపించారు. తాజాగా అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుపై శుక్రవారం సామాజిక వేత్త అన్నా హజారే స్పందించారు. తప్పు చేశాడు కాబట్టే కేజ్రీవాల్ అరెస్టు అయ్యారని అన్నారు. తనతో కలిసి పనిచేసి లిక్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలు చేశారని విమర్శించారు.

- Advertisement -

కేజ్రీవాల్ తన సొంత పనుల కోసం పాలసీలు చేశారు కాబట్టి ఈడీ అరెస్ట్ చేసిందని అన్నా హజారే వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పని చేసినందుకు సిగ్గుపడుతున్నా అని అన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ పరిస్థితి చూసి బాధగా అనిపించడం లేదన్నారు. కేజ్రీవాల్ తాను చెప్పిన మాట వినలేదన్నారు. సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా తనతో కలిసి ఉన్నప్పుడు దేశ సంక్షేమానికి ముందు ఉండాలని చెప్పానని వెల్లడించారు. కొత్త మద్యం పాలసీ విషయమై కేజ్రీవాల్‌కు రెండు సార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. కానీ ఆయన ఈ విషయాన్ని పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ కు తాను ఎటువంటి సలహా ఇవ్వబోనని.. నా మాట వినకుండా కేజ్రీవాల్ ఈ పరిస్థితి తెచ్చుకున్నారు అంటూ అన్నా హజారే మండిపడ్డారు. ఇక ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

- Advertisement -

2011లో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన అన్నా హజారే ఉద్యమంలో అర్వింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తాను రాజకీయాల్లోకి ప్రవేశించి పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఢిల్లీ సీఎంగా మూడు సార్లు ప్రమాణస్వీకారం చేశారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేజ్రీవాల్ అరెస్టు కావడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Arvind Kejriwal Arrest:జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ సందేశం.. చదివి వినిపించిన భార్య సునీత

ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా అర్వింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తున్నారు. సీఎం అరెస్టుపై ఆప్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా దెబ్బతీసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈడీ పేరుతో కుట్రలు చేస్తుందని మండిపడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News