BigTV English

CS Key instructions: రికవరీ నోటీసులపై సీఎస్ కీలక ఆదేశాలు

CS Key instructions: రికవరీ నోటీసులపై సీఎస్ కీలక ఆదేశాలు

CS Key instructions: సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న అనర్హులకు నోటీసులివ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, త్వరలోనే అర్హులే లబ్ధి పొందేలా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామంటూ వెల్లడించింది. మార్గదర్శకాలు ఇచ్చేవరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. అనర్హులకు లబ్ధి, రికవరీపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.


Also Read: హైదరాబాద్‌లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కారు

రాష్ట్రంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉండే పేద కుటుంబాలకు అందాల్సిన ఆసరా పెన్షన్లు దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు సైతం ఆసరా పెన్షన్ పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణలో బయటపడిన వారికి ఈ పెన్షన్ రద్దు చేయడంతోపాటు గతంలో పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నది. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసేంతవరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దంటూ సీఎస్ సూచించారు.


Tags

Related News

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ..! రాజకీయ వర్గాల్లో ఆసక్తి..

TGPSC Group-1: టీజీపీఎస్సీకి గుడ్ న్యూస్.. గ్రూప్-1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

Uttam Kumar Reddy: వానాకాలం ధాన్యం కొనుగోలుపై.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

Weather News: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, అక్కడక్కడ పిడుగుల వర్షం..?

Rain Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. బయటకు వచ్చారో ముంచేస్తోంది..

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ పీఠం ఎవరిది? ప్రధాన పార్టీలు ఫోకస్..

Telangana: వీరు పిల్లలు కాదు.. పిడుగుల.. సైకిల్ కోసం లోన్ కావాలని బ్యాంకుకు వెళ్లిన చిన్నారులు..

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్.. రేపోమాపో కాంగ్రెస్-బీజేపీ అభ్యర్థుల ప్రకటన, నవీన్‌పై క్రిమినల్ కేసు

Big Stories

×