E-Paper
Advertisement

Telangana Elections : రైతుబంధుపై కేసీఆర్ ప్రచారంలో నిజమెంత?

Telangana Elections : అసెంబ్లీ ఎన్నికలు సమీపస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రచారం కోసం ఏ అంశాన్ని వదలట్లేదు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు పథకాన్ని కీలక ప్రచారాస్త్రంగా ప్రయోగిస్తోంది.

Telangana Elections :  రైతుబంధుపై కేసీఆర్  ప్రచారంలో నిజమెంత?
Advertisement

Telangana Elections : అసెంబ్లీ ఎన్నికలు సమీపస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రచారం కోసం ఏ అంశాన్ని వదలట్లేదు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు పథకాన్ని కీలక ప్రచారాస్త్రంగా ప్రయోగిస్తోంది.

అయితే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం గురించి ప్రచారంలో అబద్ధం చెబుతున్నారని ఎన్నికల కమీషన్ వ్యాఖ్యలతో బయటపడింది. గులాబీ బాస్ పదే పదే రైతు బంధు, రైతు రుణ మాఫీ గురించి ప్రతి బహిరంగ సభలో మాట్లుడుతున్నారు. ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందని చెబుతున్నారు.

Advertisement

కేంద్ర ఎన్నికల కమీషన్‌కు రైతు బంధు పథకం అమలు పరిచేందుకు అనుమతులు ఇవ్వాలంటూ లేఖ కూడా రాసామని చెబుతున్నారు. ఎన్నికల కమీషన్ అనుమతి లభించగానే త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రచార సభల్లో అంటున్నారు.

ఒకవేళ ఎన్నికల కమీషన్ అనుమతిస్తే వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని అలాజరగని పక్షంలో ఎన్నికలు అయిపోగానే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెబుతున్నారు. కానీ ఈ విషయంలో ఎన్నికల కమీషన్ మరోలా చెబుతోంది.

Advertisement

తాజాగా ఎన్నికల కమీషన్ అధికారులు మాట్లాడుతూ రైతుబంధు పథకం గురించి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు లేదా లేఖలు రాలేదని తెలిపారు. ప్రభుత్వం అధికారకంగా అడినప్పుడు పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
అంటే రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నదానికి, ఎన్నికల కమీషనర్ స్పష్టం చేసినదానికి పొంతనలేదని అర్థమవుతోంది.

ఎన్నికల కమీషన్‌కు రైతు రుణమాఫీపై లేఖ రాయకుండానే రాసినట్లు గులాబీ బాస్ కేసీయార్ పదేపదే ప్రచారంలో అబద్ధం చెబుతున్న విషయం ఎన్నికల అధికారుల వ్యాఖ్యలతో ప్రజలకు తెలిసిపోయింది.

ప్రచారంలో భాగంగా రైతుబంధు డబ్బులు వేయకపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో రైతుబంధు స్కీం ఆగిపోయిందని కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ అగ్రనేతలు ఆరోపణలు కూడా చేస్తున్నారు.

పథకం అమలు చేయడానికి ప్రభుత్వ వద్ద సరిపడా నిధులు లేవనేది అసలు కారణం. 2018లోనే అమలవ్వాల్సిన హామీలు.. నిధుల కొరత కారణంగా ఇన్ని సంవత్సరాలైనా సంపూర్ణంగా అమలకాలేదు.

రైతులంతా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లేస్తారనే భయంతో ఎన్నికల కోడ్ అమలు రాకముందు కొంతమంది రైతుల ఖాతాల్లో కేసీఆర్ హడావుడిగా డబ్బులు వేశారు. ఇదంతా ఎన్నికల ప్రచారం కోసం చేసిన జిమ్మిక్కు. కొంతమంది ఖాతాల్లో డబ్బులు వేసి ఎన్నికల కోడ్, కాంగ్రెస్ అనే కారణాల వల్లే పథకం ఆగిపోయిందని బీఆర్ఎస్ నాయకులు సాకులు చెబుతున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×