E-Paper
Advertisement

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభం.. వేదికపై రాహుల్, రేవంత్ రెండు కీలక హామీలు!

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభం.. వేదికపై రాహుల్, రేవంత్ రెండు కీలక హామీలు!
Advertisement

Gig Workers Scheme: గిగ్ వర్కర్ల భద్రత, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పథకాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. జయభేరి గ్రౌండ్స్ లో గిగ్ వర్కర్ల సమక్షంలో నిర్వహించిన సభలో స్కీమ్ ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్, రేవంత్ గిగ్ వర్కర్లను ఉద్దేశించి మాట్లాడారు. గిగ్ వర్కర్లకు న్యాయం చేస్తామని.. వారి కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

వేదికపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నెహ్రూ జయంతి సందర్భంగా గిగ్ వర్కర్ల స్కీమ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పథకం ద్వారా గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా అమలు చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. అదే సమయంలో ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకూ ఆరోగ్య భద్రతను కల్పిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి.. వారికి గుర్తింపు కార్డులు అందిస్తామన్నారు.

Advertisement

గిగ్ వర్కర్లు ఎంతో కష్టపడుతున్నప్పటికీ వారికి చట్టబద్దమైన ఆదాయం, భద్రత లభించడం లేదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ అన్నారు. రోజంతా పనిచేసినా ఫ్యామిలీని పోషించేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆ దిశగా చర్యలు సైతం తీసుకుంటుందని భరోసా కల్పించారు. మాట ఇస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబెట్టుకునే నిబద్దత తమదని సీఎం దీమా వ్యక్తం చేశారు.

మరోవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మరో కీలక హామీని గిగ్ వర్కర్లకు ఇచ్చారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా విశ్రాంత భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు. అందులో ఉచిత వైఫై సదుపాయం కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. గతంలో గిగ్ వర్కర్లతో భేటి అయిన సందర్భంలో పలు సమస్యలను వారు తనతో పంచుకున్నట్లు రాహుల్ గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లోనే వారి సంక్షేమం గురించి హామీ ఇచ్చానని.. ఇవాళ దాన్ని నిలబెట్టుకోవడం చాలా సంతోషకరమని వ్యాఖ్యానించారు.

Advertisement

Also Read: కాంగ్రెస్‌ను రేవంతే ముంచేస్తారు.. 20 ఏళ్ల పాటు కోలుకోలేదు.. ఈటల రాజేందర్ జోస్యం!

గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా అందిస్తుందని రాహుల్ పునరుద్ఘటించారు. అంతేకాకుండా ప్రతీ డెలివరీలో ఒక శాతం నగదును గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తామన్నారు. గిగ్ వర్కర్ల బోర్డు ద్వారా ఆ డబ్బును బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. గిగ్ వర్కర్ల శ్రమను దోచుకునేలా, కంపెనీలకు ఉపయోగపడేలా ప్రస్తుతం కేంద్రం నిబంధనలు ఉన్నాయని రాహుల్ ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తిగా అండగా ఉంటామని మరోమారు రాహుల్ వెల్లడించారు.

Also Read: ద్విచక్రవాహనం ఎక్కిన రాహుల్, రేవంత్.. గిగా వర్కర్లతో కలిసి భారీ ర్యాలీ.. బైక్ వెంట పరిగెత్తిన టీపీసీసీ చీఫ్!

Tags

Related News

ద్విచక్రవాహనం ఎక్కిన రాహుల్, రేవంత్.. గిగా వర్కర్లతో కలిసి భారీ ర్యాలీ.. బైక్ వెంట పరిగెత్తిన టీపీసీసీ చీఫ్!

కాంగ్రెస్‌ను రేవంతే ముంచేస్తారు.. 20 ఏళ్ల పాటు కోలుకోలేదు.. ఈటల రాజేందర్ జోస్యం!

నోవాటెల్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ పాలిటిక్స్.. సీఎం రేవంత్, మంత్రులతో రాహుల్ భేటి.. టిఫిన్ చేస్తూనే రాజకీయాలపై ఆరా!

దేశంలో ఫాసిస్ట్ పాలన.. కేసీఆర్‌ది మోసపూరిత చరిత్ర.. మహేష్ గౌడ్, కోమటిరెడ్డి ఫైర్!

‘అది భారత్ సమ్మిట్ కాదు.. యాంటీ-భారత్ సమ్మిట్’.. రాంచందర్ రావు హౌస్ అరెస్ట్‌పై బీజేపీ ఫైర్!

పాతబస్తీలో ఏనుగు బీభత్సం.. బ్యాండ్ శబ్దానికి బెదిరి పరుగులు!

‘భారత్ సమ్మిట్’ డే 2.. అర్ధరాత్రి హైదరాబాద్‌కు రాహుల్.. నేడు సీఎం రేవంత్‌తో కలిసి గిగ్ వర్కర్ల స్కీమ్‌కు శ్రీకారం!

Big Stories

Advertisement
×