E-Paper
Advertisement

ద్విచక్రవాహనం ఎక్కిన రాహుల్, రేవంత్.. గిగా వర్కర్లతో కలిసి భారీ ర్యాలీ.. బైక్ వెంట పరిగెత్తిన టీపీసీసీ చీఫ్!

ద్విచక్రవాహనం ఎక్కిన రాహుల్, రేవంత్.. గిగా వర్కర్లతో కలిసి భారీ ర్యాలీ.. బైక్ వెంట పరిగెత్తిన టీపీసీసీ చీఫ్!
Advertisement

Rahul Revanth Bike Rally: హైదరాబాద్ మహానగరంలో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గిగ్ వర్కర్లు నిర్వహించి భారీ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు ఈ ర్యాలీ జరిగ్గా.. రాహుల్, రేవంత్ గ్రిగ్ వర్కర్ల బైక్ ఎక్కారు. బైక్ పైనే ఇద్దరూ ప్రయాణించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వారి బైక్ లను వెంబడిస్తూ వెనుక పరుగులు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే ర్యాలీలో రాహుల్ గాంధీ తన స్కూటీ ఎక్కి కూర్చోవడంపై గిగా వర్కర్ లలిత ఆనందం వ్యక్తం చేశారు. తాను బైక్ తో సిద్దంగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి.. రాహుల్ మీ స్కూటీ ఎక్కుతారని చెప్పారని ఆమె తెలిపారు. కొద్దిసేపటికే రాహుల్ తన వెనుక వచ్చి కూర్చున్నారని పేర్కొన్నారు. రాహుల్ ను కూర్చుబెట్టుకొని స్కూటీ నడపడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని లలిత సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ తనతో బాగా మాట్లాడారని, మహిళా గిగ్ వర్కర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారని లలిత చెప్పారు. మహిళలకు తగిన భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాహుల్ ను కోరినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

Advertisement

Also Read: కాంగ్రెస్‌ను రేవంతే ముంచేస్తారు.. 20 ఏళ్ల పాటు కోలుకోలేదు.. ఈటల రాజేందర్ జోస్యం!

కాగా, శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకూ బైక్ ర్యాలీ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీకి ఇబ్బందులు లేకుండా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య ఆంక్షలు విధించారు. సైబర్ టవర్స్ నుంచి హైటెక్స్ మెటల్ చార్మినార్ మీదుగా హెచ్ఐసీసీ, నోవాటెల్ వరకూ ఆంక్షలు కొనసాగాయి. ఆంక్షల సమయంలో భారీ వాహనాల రాకపోకలు పోలీసులు పూర్తిగా నిషేధించారు. వాహనాదారులు ప్రత్యామ్నయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Advertisement

Also Read: జియో బంపరాఫర్.. ఆ ప్లాన్‌పై 84 రోజులు నెట్‌ఫ్లిక్స్ ఉచితం.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్!

Tags

Related News

కాంగ్రెస్‌ను రేవంతే ముంచేస్తారు.. 20 ఏళ్ల పాటు కోలుకోలేదు.. ఈటల రాజేందర్ జోస్యం!

నోవాటెల్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ పాలిటిక్స్.. సీఎం రేవంత్, మంత్రులతో రాహుల్ భేటి.. టిఫిన్ చేస్తూనే రాజకీయాలపై ఆరా!

దేశంలో ఫాసిస్ట్ పాలన.. కేసీఆర్‌ది మోసపూరిత చరిత్ర.. మహేష్ గౌడ్, కోమటిరెడ్డి ఫైర్!

‘అది భారత్ సమ్మిట్ కాదు.. యాంటీ-భారత్ సమ్మిట్’.. రాంచందర్ రావు హౌస్ అరెస్ట్‌పై బీజేపీ ఫైర్!

పాతబస్తీలో ఏనుగు బీభత్సం.. బ్యాండ్ శబ్దానికి బెదిరి పరుగులు!

‘భారత్ సమ్మిట్’ డే 2.. అర్ధరాత్రి హైదరాబాద్‌కు రాహుల్.. నేడు సీఎం రేవంత్‌తో కలిసి గిగ్ వర్కర్ల స్కీమ్‌కు శ్రీకారం!

విదేశీ ప్రతినిధుల వీసాల రద్దుపై రాజకీయ దుమారం.. కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్!

Big Stories

Advertisement
×