Vasundhara Serial:ఇటీవలకాలంలో బుల్లితెర,వెండితెర అని తేడా లేకుండా ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే దిశగా సెలబ్రిటీలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వెండితెరపై నటించే వాళ్ళు బుల్లితెరపై నటిస్తే మళ్లీ అవకాశాలు రావేమో అని భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొంతమంది బుల్లితెరపై సత్తా చాటి వెండితెరపై అవకాశాలు అందుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పైగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు సినిమాలలోనే నటిస్తూ.. తమ వారసులను కూడా సినిమాల వైపే అడుగులు వేయిస్తుంటే.. ఇక్కడ ఒక స్టార్ కమెడియన్ కూతురు మాత్రం సీరియల్స్ లో అద్భుతమైన పాత్రలు పోషిస్తూ బుల్లితెర అభిమానుల హృదయాలను దోచుకుంటున్నారు.
ఆమె ఎవరో కాదు ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న ‘వసుంధర’ సీరియల్లో వసు అత్తగా, దేవగుడి శ్రీ ప్రశాంతి పాత్రలో నటిస్తున్న శాంతి శ్రీనివాస్ (Shanti Srinivas).. ఇందులో తన హుందాతనంతో, అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. వసుంధరకి అత్తగా పాజిటివ్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. ఈమె ఒక స్టార్ హీరోయిన్ కూతురు అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈమె ఎవరో కాదు ఒకప్పుడు తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో వెండితెరపై అందరినీ కడుపుబ్బా నవ్వించిన దివంగత కమెడియన్ ఏవీఎస్ కూతురు.
డైలీ సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. శ్రీవల్లి అనే సీరియల్ లో కూడా పనిచేసింది . పైగా ఈ సీరియల్ విశేషాలను పలు ఇంటర్వ్యూలలో కూడా ఈమె పంచుకున్నారు. ఇకపోతే మొన్నా మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఎపిసోడ్ లలో కూడా కనిపించిన ఈమె.. సినిమాలలో నటించలేదు. కానీ సినిమా ఈవెంట్లకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. అందులో భాగంగానే 2026 కోనా ఫిలిం కార్పొరేషన్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘బ్యాండ్ మేళం’ సినిమా ప్రీ రిలీజ్ తో పాటు థాంక్యూ మీట్ కార్యక్రమాలకు హాజరై ప్రసంగించారు. అలాగే తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన డాక్టర్ బేబ్ ‘ మూవీ ప్రమోషన్స్ లో , టీజర్ విడుదల కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం డైలీ సీరియల్స్ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చురుకుగా పాల్గొంటున్నారు.
also read:వర్షిణికి షాక్ ఇచ్చిన హౌస్ మేట్స్.. ఫ్రెండ్ అంటూనే ముంచేశారుగా!
శాంతి శ్రీనివాస్ తన తండ్రిని కాపాడేందుకు తనలో కొంత శాతం లివర్ ను కూడా దానం చేసి.. కూతురుగా ఎంతో గొప్ప త్యాగం చేసింది. అయితే ఏవీఎస్ అనారోగ్యం కారణంగా ఎక్కువగా రోజులు జీవించలేదు. తండ్రి మరణంతో కొంతకాలం బయట కనిపించడం తగ్గించిన ఈమె.. మళ్లీ ఇప్పుడిప్పుడే పలు టీవీ షోలో, సినిమా కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఏది ఏమైనా వెండితెరపై నవ్వులు పూయించి మనలందరినీ కడుపుబ్బా నవ్వించిన ఏవీఎస్ కూతురు ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ అలరిస్తోందని తెలిసి అభిమానులు సంబరపడిపోతున్నారు.