Telangana Gove Alert: బర్డ్ ఫ్లూ పంజా విసరడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ మృత్యువాత పడడంతో ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కొన్ని రోజులు చికెన్ తినవద్దు సూచన చేసింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీలకు వ్యాపించినట్లు సమాచారం.
ఇదిలావుండగా ఏపీలో కోళ్ల మరణాలకు బర్డ్ ప్లూ కారణమని తేలింది. రెండు వారాలుగా కొన్ని జిల్లాలపై ఈ వైరస్ పంజా విసిరింది. ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా( హెచ్ 5 ఎన్ 1) అని భోపాల్ లోని యానిమల్ డిసీజ్ ల్యాబ్ తేల్చింది. గడిచిన వారంలో దాదాపు 25 లక్షలకు కోళ్లు మృత్యువాత పడ్డాయి.
ఇదే క్రమంలో సోమవారం ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కోళ్ల పెంపకందారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇదిలావుండగా ఇటీవల కాలంలో కొల్లేరు సరస్సుకు భారీగా పక్షలు వలస వచ్చాయి. వాటి ద్వారా కోళ్లకు ఈ వైరస్ వ్యాపించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ALERT: కొన్ని రోజులు చికెన్ తినవద్దు.. తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక
కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన తెలంగాణ ప్రభుత్వం
ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీలకు వ్యాపించినట్లు సమాచారం pic.twitter.com/3i27H2LiD2
— BIG TV Breaking News (@bigtvtelugu) February 11, 2025