Ashu Reddy.. అషు రెడ్డి (Ashu Reddy).. సోషల్ మీడియాలో వీడియోస్, రీల్స్ ద్వారా పాపులారిటీ అందుకున్న ఈమె బిగ్ బాస్ (Bigg Boss) షో లోకి అడుగు పెట్టిన తర్వాత.. తన ఆటతో, గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ గా మారిన అషు రెడ్డి పలు టీవీ షోలలో పాల్గొంటూ బిజీగా మారిపోయింది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ (RGV) తో చేసిన ఇంటర్వ్యూ నెట్టింట సెన్సేషన్ అయిపోయింది. ఆ క్రేజ్ తో మరింత క్రేజ్ అందుకున్న అషు రెడ్డి అటు సినిమాలలో కూడా చిన్నచిన్న పాత్రలు చేస్తూ వస్తోంది. బిగ్ బాస్ తర్వాత ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈమెకు మాత్రం పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో పాల్గొంటూ బిజీగా మారింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ‘మాస్టర్ పీస్’ అనే సినిమాలో నటిస్తోంది అషు రెడ్డి.
బ్రెయిన్ సర్జరీ.. ఎమోషనల్ అయిన అషు రెడ్డి..
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా అషూ రెడ్డి సర్జరీ చేయించుకుంది అంటూ వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో ఒక టీవీ షోలో పాల్గొన్న ఈమె ఆసక్తికర విషయాన్ని పంచుకుంటూ సర్జరీపై క్లారిటీ ఇచ్చింది. అషు రెడ్డి మాట్లాడుతూ.. నా తలకు సర్జరీ అయ్యింది. బ్రెయిన్ కి ఆపరేషన్ చేయడం కోసం జుట్టు మొత్తం తీసేస్తామన్నారు. పూర్తిగా గుండు చేసినా పర్లేదు కానీ అరగుండు మాత్రం చేయొద్దని వేడుకొన్నాను. ఇక సర్జరీ జరిగిన మూడు రోజుల తర్వాత నేను అద్దంలో నా ముఖం చూసుకుంటే, నా కెరియర్ అయిపోయిందని అనుకున్నాను”.. అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది అషు రెడ్డి. ఇక తర్వాత నెల రోజులకు తిరిగి కోలుకొని ఏదోలా జుట్టు సెట్ చేసుకున్నాను అంటూ తెలిపింది. ఇక అషూ రెడ్డి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు అటు నెట్టిజెన్స్ కూడా ఈ కామెంట్స్ పై రకరకాలుగా స్పందిస్తూ ఉండడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోనే ఉద్యోగాన్ని వదిలేసి..
అషు రెడ్డి విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసిన ఈమె, పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతోనే ఇండియాకి తిరిగి వచ్చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసమే అక్కడ వారితో గొడవ పెట్టుకున్నట్లు గతంలో కొన్ని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అలా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఇండియాకి వచ్చిన ఈమె ఇక్కడ పలు రీల్స్ చేస్తూ జూనియర్ సమంత (Jr.Samantha)గా పేరు దక్కించుకుంది. దాంతో మరింత పాపులారిటీ అందుకుంది అషు రెడ్డి. ఇక తర్వాత చాలా గ్లామర్ గా తయారవుతూ విదేశాలు చుట్టేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతోనే సినిమా రంగంలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం రావాలని, ఆయన సినిమాలో కనీసం చిన్న పాత్ర అయినా ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అషు రెడ్డి కి అభిమానుల కోరిక మేరకు పవన్ మూవీలో అవకాశం వస్తుందేమో చూడాలి.