BigTV English

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రవాసి ప్రజావాణికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. గల్ఫ్‌లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 5లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది డిసెంబర్ 7 తర్వాత మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఈ ఎక్స్ గ్రేషియా అందించనుంది. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా.. గల్ఫ్‌ కార్మికుల వెల్ఫేర్‌ కోసం 2023 డిసెంబర్ 7 నుంచి కార్మికుల సమస్యలపై అడ్వైజరీ కమిటీని నియమించనుంది.


Also Read: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

ప్రవాస ప్రజావాణి పేరుతో నేటి నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది తెలంగాణ ప్రభుత్వం. బతుకుతెరువు కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. తర్వాత అక్కడ పడుతున్న బాధలు, వేర్వేరు కారణాలతో అక్కడ మృతి చెందే ఘటనలు అనేకం. వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున వారి కుటుంబాలను ఆదుకోడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్య అవకాశాలను కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలే ప్రకటించారు.


 

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×