E-Paper
Advertisement

Musi River Project: మూసీ ప్రక్షాళనకు మొట్టమొదటి భూసేకరణ ఈ జిల్లా నుంచే ప్రారంభం

Musi River Project: మూసీ ప్రక్షాళనకు మొట్టమొదటి భూసేకరణ ఈ జిల్లా నుంచే ప్రారంభం
Advertisement

Musi River Project: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడిన సర్కారు మానస పుత్రిక ప్రాజెక్ట్ అయిన మూసి ప్రక్షాళన సుందరీ కరణ మరో అడుగు ముందుకు పడింది. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కార్యరూపం దాల్చే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టును కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భాగంగా మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధి కోసం అధికారికంగా భూసేకరణ ప్రక్రియ కోసం సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ద్వారా తాజాగా ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

గ్రామాల వారీగా సర్వే నంబర్లు..

మూసీ సుందరీకరణలో భాగంగా తొలి విడత భూసేకరణను రంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని గోల్కొండ, గండిపేట మండలాల పరిధిలో సుమారు 50 ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఆయా గ్రామాల వారీగా సర్వే నంబర్లతో కూడిన సమగ్ర జాబితాను నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నప్పటికీ, ఆపరేషన్ మొదట రంగారెడ్డి నుంచే మొదలు కాలినట్లు తెలిసింది.

Advertisement

Also Read: GHMC: ఇకపై మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

నిర్వాసితులకు ప్రభుత్వం భరోసా..

భూములు కోల్పోతున్న రైతులు, యజమానులలో ఆందోళన కలగకుండా ప్రభుత్వం ముందుగానే భరోసా ఇచ్చే ప్రయత్నం చేయనుంది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగానే బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అభివృద్ధి పేరుతో ఎవరికీ అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

అభ్యంతరాల స్వీకరణ

Advertisement

ప్రభుత్వం గుర్తించిన భూములకు సంబంధించి యజమానులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించేందుకు సర్కారు అవకాశం కల్పించింది. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలను సమర్పించాలని సర్కార్ సూచించింది. రైతులు, భూయజమానుల నుంచి వచ్చే అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని నోటిఫికేషన్‌లో సర్కారు పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అభివృద్ధి పనులు వేగవంతం అయ్యే అవకాశాలున్నాయి.

Also Read: Filmfare Awards: మొదలైన ఫిల్మ్‌ఫేర్ సందడి.. టాలీవుడ్ నుంచి నామినేషన్ల జాబితా ఇదే!

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×