BigTV English

Prahari Clubs: డ్రగ్స్‌ను అరికట్టేందుకు మాస్టర్ ప్లాన్.. ప్రహరీ క్లబ్స్‌తో నిఘా

Prahari Clubs: డ్రగ్స్‌ను అరికట్టేందుకు మాస్టర్ ప్లాన్.. ప్రహరీ క్లబ్స్‌తో నిఘా

Prahari clubs to combat drug abuse in high school: రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూళ్లల్లో ప్రహరీ క్లబ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో మాదకద్రవ్యాల విక్రయాలు జరగకుండా, విద్యార్థులు వాటి బారిన పడకుండా ప్రహరీ క్లబ్ లు నిఘా పెట్టనున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు. పిల్లలను మాదకద్రవ్యాల దుర్వినియోగం నుంచి దూరం చేయడానికి ప్రహరీ క్లబ్ లను ఏర్పాటు చేయనున్నారు.


పాఠశాలల్లో ప్రహరీ క్లబ్ అధ్యక్షుడిగా హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ ఉండనున్నాడు. వైస్ ప్రెసిడెంట్ గా సీనియర్ టీచర్ లేదా ఫ్రెండ్లీ టీచర్ ఉంటారు. 6 నుంచి పదో తరగతి వరకు ప్రతి క్లాసులో ఇద్దరు విద్యార్థులు, స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్.. పేరెంట్స్ నుంచి ఒకరు ప్రహరీ క్లబ్ లో సభ్యులుగా ఉండనున్నారు. విద్య సంస్థల్లోకి మత్తు పదార్థాలు చేరకుండా, విద్యార్థులు వాటి ఊబిలో చిక్కుకోకుండా అవసరమైన ప్రణాళికలను ప్రహరీ క్లబ్ లు రూపొందిస్తాయి.

Also Read: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తాం: రేవంత్ రెడ్డి


ప్రస్తుతానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ ప్రహరీ క్లబ్ లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ ను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనున్నది.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×