E-Paper
Advertisement

Telangana: వేటు వేస్తాం.. ఉద్యోగులకు అల్టిమేటం.. ఎన్నికల ముందు సర్కారు సాహసం?

Telangana: వేటు వేస్తాం.. ఉద్యోగులకు అల్టిమేటం.. ఎన్నికల ముందు సర్కారు సాహసం?
Advertisement
jps

Telangana: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారంలోగా విధుల్లోకి చేరాలని అల్టిమేటం జారీ చేసింది. లేదంటే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది.

గత 11 రోజులుగా జూనియర్ పంచాయితీ కార్యదర్శులు సమ్మెకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి.

Advertisement

ఉద్యోగ నియామక ఒప్పందాన్ని జేపీఎస్‌లు ఉల్లంఘించారంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా యూనియన్లు ఏర్పాటు చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగ నియామకాల్లో అందరినీ క్రమబద్దీకరిస్తామని ఎక్కడా చెప్పలేదని సర్కార్ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.

పనితీరు బాగున్న వారిని మాత్రమే రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పామంది ప్రభుత్వం. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలంటూ ఆదేశించింది. ఆ లోపు విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ జేపీఎస్‌లను హెచ్చరించింది.

Advertisement

సర్కార్ అల్టిమేటంతో.. జేపీఎస్‌ల తదుపరి కార్యాచరణ ఏంటి అనే ఉత్కంఠ నెలకొంది. సర్కార్ జారీ చేసిన నోటీసులకు తలొగ్గి.. విధుల్లో చేరుతారా లేక సమ్మెను కంటీన్యూ చేసి పంతం నెగ్గించుకుంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ జీపీఎస్‌లు సమ్మె విరమించకపోతే సర్కార్ అన్నంత పని చేస్తుందా? కార్యదర్శులను నిజంగానే విధుల నుంచి తొలగిస్తుందా? అనేది ఆసక్తి రేపుతోంది. మరో 6నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందా? చూడాలి..

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×