Adi Vs Harishrao: బీఆర్ఎస్ నేత హరీష్‌రావు అధికార పార్టీ మండిపడింది. ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు విప్ ఆది శ్రీనివాస్. స్టేచర్ గురించి ముందు మాట్లాడింది కేటీఆర్ అని గుర్తు చేశారు. సీఎం పదవి కంటే స్టేచర్ ఇంకేమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. కుటుంబం అంతా కలిసి వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని, అందుకే ప్రజలు మీ స్టేచర్‌ను దించారన్నారు.
మీడియా పాయింట్
గురువారం అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్‌రెడ్డిపై హద్దు మీరి హరీష్‌రావు మాట్లాడటాన్ని తప్పుబట్టారు ఆయన. ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఇదే విధానాన్ని కంటిన్యూ చేస్తే, పార్టీ నేతలు, కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. అసలు స్టేచర్ గురించి ముందు మాట్లాడిందే కేటీఆర్ అని అన్నారు.
కేసీఆర్ మీ నాయకుడు కావచ్చు.. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. తెలంగాణలో సీఎం పదవి కంటే స్టేచర్ ఇంకేముందని ప్రశ్నించారు. సీఎం పదవి మీ కళ్లకు కనిపించలేదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో నలుగురు పదవులు తీసుకోలేదా? వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అని ఆరోపించారు.
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
ప్రజలు మీ స్టేచర్‌ను దింపి సీఎంగా రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న మీరు మాట్లాడుతున్నారా? రోజూ 18 గంటలు కష్టపడి సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.
ALSO READ: బై బ్యాక్ స్కీమ్ పేరుతో భారీ మోసం
ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండపడ్డారు. మీరు చేస్తున్న ప్రతీ పని తెలంగాణ ప్రజానీకం గమనిస్తోందన్నారు. ప్రజాస్వామ్యం, గవర్నర్, ముఖ్యమంత్రి అంటే ఆ పార్టీకి విలువలేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టే స్థాయి లేనివారు సీఎం గురించి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీకు మాదిరి తాము దొంగ దీక్షలు చేయలేదు.. పెట్రోల్ దొరికినా అగ్గిపెట్టె దొరకలేదు అనే విధంగా చేయలేదన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారని రుసరుసలాడారు. హరీష్‌రావు.. గ్రామాల్లో తరిమికొట్టే రోజులు ముందు ఉన్నాయని హెచ్చరించారు. మీరు చేసిన తప్పులు, అప్పులు సరి చేస్తూ వస్తున్నామన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇది చూసి ఓర్వలేకే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం దివాలా తీయడానికి కారణం మీ మామ- అల్లుళ్లు కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్‌రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఐలయ్య.
అధికార పార్టీపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. 15 నెలల కాంగ్రెస్ పాలన, 15 స్కాములు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరును ప్రజలు చూస్తున్నారన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ పాలనతో చేసిన అభివృద్ధిని దేశానికి చూపెట్టారు కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రతిపక్ష నేత చావు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. వందల మంది ఎల్ఓపీ లీడర్లు అయ్యారు కానీ, ఏ ఒక్కరూ చావు గురించి మాట్లాడలేదన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా? మీకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
హరీశ్ రావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోం
స్టేచర్ గురుంచి ముందు మాట్లాడింది కేటీఆర్
సీఎం పదవి కంటే స్టేచర్ ఇంకేమైనా ఉంటుందా..?
కుటుంబం అంతా కలిసి వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారు
అందుకే ప్రజలు మీ స్టేచర్ ను… pic.twitter.com/NoARp9MIfm
— BIG TV Breaking News (@bigtvtelugu) March 13, 2025