World Kidney Day 2025: కిడ్నీ మన శరీరంలోని శక్తివంతమైన ఫిల్టర్. ఇవి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి పని చేస్తాయి. కానీ చెడు జీవనశైలి మూత్ర పిండాల పని తీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మీ ఇంట్లో ఉండే వాటర్ ప్యూరిఫయర్‌ను మీరు ఎప్పటికప్పుడు శుభ్రం చేసినట్లే. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే.. ముఖ్యం.
ప్రపంచవ్యాప్తంగా 850 మిలియన్లకు పైగా ప్రజలు మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. భారతదేశంలో దాదాపు 140 మిలియన్ల మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో సతమతం అవుతున్నారు. అందుకే సకాలంలో మూత్రపిండాల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం చాలా అవసరం. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని మార్చి 13 2025న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. కిడ్నీ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మార్చి రెండవ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రత్యేక దినోత్సవాన్ని 2006లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్ ప్రారంభించాయి. ప్రతి ఏటా కిడ్నీ డే రోజు ఒక థీమ్ ఉంటుంది. ఈ ఏడాది ప్రపంచ కిడ్నీ దినోత్సవం యొక్క థీమ్.. మీ కిడ్నీలు బాగున్నాయా ? సకాలంలో సమస్యలను గుర్తించండం. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటం.
ఇవి మూత్రపిండాలకు సూపర్ ఫుడ్స్ :
మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేసే సూపర్‌ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు మీ మూత్రపిండాలను అనేక వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవచ్చు.
1. వెల్లుల్లి:
వెల్లుల్లి మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, విటమిన్ 6 ఉంటాయి. ఈ మూడు మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచివి. వెల్లుల్లి కూడా అల్బుమినూరియాను తగ్గిస్తుంది. అంటే మూత్రంలో ప్రోటీన్ మొత్తాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. అంతే కాకుండా వెల్లుల్లి మూత్రపిండాల వాపు నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఇది మూత్రపిండాల యొక్క ఫైబ్రోసిస్ సమస్యను కూడా నియంత్రిస్తుంది. రీనల్ ఫైబ్రోసిస్ కిడ్నీ వ్యాధికి కారణమవుతుంది.
2. ఉల్లిపాయ:
ఉల్లిపాయ మీ ఆహార రుచిని పెంచడమే కాదు. బదులుగా ఇది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ సి, మాంగనీస్, ఫోలేట్ ఆమ్లం ఉంటాయి. వీటి అద్భుతమైన కలయిక మూత్రపిండాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయలో తక్కువ పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా ఈ ప్రసిద్ధ సలాడ్ మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది క్రియేటినిన్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. వీటిలో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మూత్రపిండాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
3. షిటాకే పుట్టగొడుగులు:
అన్ని పుట్టగొడుగులు మూత్రపిండాల ఆరోగ్యానికి మంచివి. కానీ మూత్రపిండాలకు మేలు చేసే షిటాకే పుట్టగొడుగులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా వీటిలో విటమిన్ డి తో పాటు రాగి, మాంగనీస్ , సెలీనియం కూడా ఉంటాయి. ఇవి మూత్రపిండాల పనిని సులభతరం చేస్తాయి. అంతే కాకుండా వాటిని మెరుగుపరుస్తాయి.
4. ఎగ్స్:
ఎగ్స్ తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా మీరు మూత్రపిండాల సమస్యలతో బాధపడుతుంటే లేదా మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే.. గుడ్లను మీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఎగ్ వైయిట్ తినడం వల్ల కిడ్నీలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కానీ భాస్వరం పరిమాణం తక్కువగా ఉంటుంది. కిడ్నీ రోగులు తక్కువ భాస్వరం తీసుకోవాలి.
Also Read: అమ్మమ్మల కాలం నాటి ఈ చిట్కాలు పాటిస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం
5. బ్లూబెర్రీస్:
కిడ్నీ రోగులు బ్లూ బెర్రీలు తినడం మంచిది. ఎందుకంటే వాటిలో సోడియం, పొటాషియం, భాస్వరం చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అంతే కాకుండా ఇందులో విటమిన్ సి , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇవి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో వీటిని తినడం మంచిది. మీరు వాటిని సలాడ్, స్మూతీ లేదా పెరుగుతో కూడా వీటిని తినవచ్చు.
6. పుచ్చకాయ:
ఎక్కువ పరిమాణంలో నీరు ఉండే పుచ్చకాయ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇది మూత్రపిండాలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. దీని రసంతో శరీరం నుండి వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. ఇందులో లైకోపీన్ ,విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాలకు మేలు చేస్తాయి. అంతే కాకుండా పుచ్చకాయలో అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. దీని వల్ల వాపు తగ్గుతుంది. అంతే కాకుండా ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయం చేస్తుంది.